Home /News /movies /

SENIOR ACTRESS LATHA SRI SHARED A BAD MEMORY IN HER LIFE AND SAYS SAVED BY HERO NARESH PK

నా నడుము గిల్లాడు.. ఆ రోజు నరేష్ లేకపోయుంటే.. సీనియర్ నటి లతా శ్రీ మనోగతం..

సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)

సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)

Actress Latha Sri: లతా శ్రీ.. ఈ తరం వాళ్లకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోయి ఉండొచ్చు. కానీ 90ల్లో ఉన్న జనరేషన్‌కు మాత్రం లతా శ్రీ పేరు బాగానే తెలుసు. అప్పట్లో చాలా సినిమాలు చేసింది..

లతా శ్రీ.. ఈ తరం వాళ్లకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోయి ఉండొచ్చు. కానీ 90ల్లో ఉన్న జనరేషన్‌కు మాత్రం లతా శ్రీ పేరు బాగానే తెలుసు. అప్పట్లో చాలా సినిమాలు చేసింది ఈ సీనియర్ హీరోయిన్. గ్లామరస్ కారెక్టర్స్‌కు పెట్టింది పేరు ఈమె. ఒకప్పుడు వరస సినిమాలు చేసి తెలుగులో సంచలనాలు రేపింది కూడా. ముఖ్యంగా సీనియర్ హీరో నరేష్, సీత జంటగా రేలంగి నరసింహారావు తెరకెక్కించిన ‘పోలీస్ భార్య’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో చాలా బోల్డ్ పాత్ర చేసింది లతా శ్రీ. ఈ సినిమాలో కారెక్టర్‌కు అప్పట్లో ఆమెకు చాలా పాపులారిటీ కూడా వచ్చింది.
సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)
సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)

ఈ సినిమా 100 రోజుల వేడుకల్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది లతా శ్రీ. ఆ సినిమా వేడుకల్లో తాము బిజీగా ఉంటే.. ఒకడు వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. నడుము గిల్లేసాడని చెప్పుకొచ్చింది లతా శ్రీ. దాంతో వెంటనే వాడి చెంప ఛెల్లుమనిపించేసానని చెప్పింది ఈ హీరోయిన్. తనకు నార్మల్‌గానే కోపం ఎక్కువగా ఉంటుందని.. అలాంటి సమయంలో ఇలాంటి పనులు చేస్తే మండిపోతుందని చెప్పింది లత. అయితే అప్పట్లో సినిమా వేడుకలకు ఎక్కువగా ఆర్టిస్టులు వచ్చేవాళ్లు కాదు కానీ ఈ వేడుకకు చాలా మంది ఆర్టిస్టులు వచ్చేసరికి జనం కూడా భారీగానే వచ్చారని చెప్పింది. అందరం కలిసి వెళ్తున్న సమయంలోనే ఒకడు జనంలోంచి వచ్చి తన నడుముని గట్టిగా గిల్లేశాడని గుర్తు చేసుకుంది.
సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)
సీనియర్ నటి లతా శ్రీ (Latha Sri)

వాడి వైపు కోపంగా చూస్తుండగానే మళ్లీ ఏదో చేయబోతుంటే కొట్టేసానని చెప్పింది లతా శ్రీ. వెంటనే వాడు అక్కడ్నుంచి వెళ్లిపోయి పదిమంది గ్యాంగ్‌ని తీసుకొచ్చాడని చెప్పింది. ఏంటి మావాడ్ని కొట్టావ్ అంటూ మీది మీదికి వస్తుంటే.. హీరో నరేష్ రియల్ హీరో అనిపించుకున్నాడని చెప్పింది. వాళ్లతో ఫైట్ చేసి.. అందర్నీ వెనక్కి నెట్టేసి పోలీసుల్ని పిలిచించాడని గుర్తు చేసుకుంది. అక్కడ్నుంచి హీరో నరేష్ తనకు ప్రొటక్షన్‌గా మారి వ్యాన్ ఎక్కించి ఇంటికి పంపారని చెప్పింది లతా శ్రీ. ఇదిలా ఉంటే 15 ఏళ్ల వయసులోనే ఈమె ఇండస్ట్రీకి వచ్చింది. యమలీలలో ఓ పాట కూడా చేసింది. దాంతో పాటు చాలా సినిమాలు చేసింది. చివరగా ఈవీవీ తెరకెక్కించిన అత్తిలి సత్తిబాబులో కనిపించింది లతా శ్రీ.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Naresh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు