ఖుష్బూ షాకింగ్ మేకోవర్.. లాక్‌డౌన్‌లో 15 కిలోలు హాంఫట్..

Kushboo makeover: ఇక్కడున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండంటే కాస్త కష్టమే. ఎందుకంటే అసలు గుర్తు కూడా పట్టకుండా మేకోవర్ అయిపోయింది ఖుష్బూ. ఈ పేరు వినగానే బొద్దుగా ఉండే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2020, 9:18 AM IST
ఖుష్బూ షాకింగ్ మేకోవర్.. లాక్‌డౌన్‌లో 15 కిలోలు హాంఫట్..
ఖుష్బూ న్యూ లుక్ (kushboo new look)
  • Share this:
ఇక్కడున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండంటే కాస్త కష్టమే. ఎందుకంటే అసలు గుర్తు కూడా పట్టకుండా మేకోవర్ అయిపోయింది ఖుష్బూ. ఈ పేరు వినగానే బొద్దుగా ఉండే ముద్దుగుమ్మే గుర్తుకొస్తుంది. కానీ లాక్‌డౌన్ పుణ్యమా అని ఏకంగా మూడు నెలల్లోనే 15 కిలోలు తగ్గిపోయి షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. వయసు పెరిగినా కూడా ఏ మాత్రం తరగని అందంతో ఆమె అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పుడు ఖుష్బూ లుక్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. లాక్‌డౌన్ ముందు వరకు కూడా బొద్దుగా ముద్దుగా ఉన్న నటి ఇప్పుడు మాత్రం చాలా సన్నబడిపోయింది.


15 కిలోలు తగ్గి కుర్ర హీరోయిన్‌లా మారిపోయింది. 15 కిలోల బరువు తగ్గడమేమో కానీ ఇప్పుడు ఖుష్బూను చూస్తుంటే ఏకంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తుంది. తను ఇన్ని కిలోలు సన్నబడిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఖుష్బూ. ఈ ఫోటోలో ఉన్న ఆమెను చూసి అసలు మీరేనా అక్కడున్నది అంటూ షాక్ అవుతున్నారు అభిమానులు.
ఖుష్బూ న్యూ లుక్ (kushboo new look)
ఖుష్బూ న్యూ లుక్ (kushboo new look)

కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన కుష్బూ.. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. దాంతో పాటే మంచి కథలు వచ్చినపుడు నటిస్తుంది కూడా. ఈ క్రమంలోనే రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్త సినిమాలో నటిస్తుంది ఖుష్బూ.
First published: June 7, 2020, 9:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading