సినీనటి ఖుష్బూకి అసలు ఏమైంది.. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్..

ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందే తీవ్రంగా జబ్బుపడింది ఖుష్బూ. దీంతో హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: May 24, 2019, 5:49 PM IST
సినీనటి ఖుష్బూకి అసలు ఏమైంది.. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్..
సినీ నటి ఖుష్బు (ఫైల్ ఫోటో )
  • Share this:
సీనియర్ నటి ఖుష్బూ అటూ సినిమాలు, ఇటూసీరియల్స్ చేస్తూనే మరోవైపు రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంటోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారకర్తగా చేసిన ఈ సీనియర్ హీరోయిన్ జబ్బుపడింది. ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందే తీవ్రంగా జబ్బుపడింది. దీంతో హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసింది.

‘ఎలక్షన్ రిజల్ట్స్ సమయంలో నేను ఛానెల్స్‌లో కనబడడం లేదు. ఆరోగ్యం బాలేని కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యా.. దీంతో డ్రామాలను మిస్ అవుతున్నా.. ’ అంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది. దీంతో ఖుష్బూ త్వరగా కోలుకోవాలంటూ తమిళ తంబీలతో పాటు అభిమానులందరూ రీట్వీట్స్ చేశారు.

తమిళం, తెలుగులో పాటు ఎన్నో సినిమాలు చేసిన ఈ సీనియర్ నటికి అప్పట్లో మంచి ఫాలోయింగే ఉంది. అభిమానుల చేత గుడికట్టించుకున్న మొట్టమొదటి హీరోయిన్ ఈమె కావడం విశేషం.

ఇవి కూడా చదవండి..
అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారన్న అదితీరావు హైదరీ
First published: May 24, 2019, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading