హోమ్ /వార్తలు /సినిమా /

దీనస్థితిలో ప్రముఖ నటి.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సీనియర్ హీరోయిన్.. !

దీనస్థితిలో ప్రముఖ నటి.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన సీనియర్ హీరోయిన్.. !

దీన స్థితిలో నటి జయకుమారి

దీన స్థితిలో నటి జయకుమారి

ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె రెండు కీడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ కోసం... ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెరపై కనిపించినంత అందంగా అందరి జీవితాలు ఉండవని.. ఇప్పటికే చాలామంది సినీ నటుల్ని చూస్తే మనకు అర్థమైంది. కొందరు సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకొని.. తమ జీవితంలో ఆనందంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం తినడానికి తిండిలేని దీన స్థితిలోకి కూడా దిగుజారుతున్నారు. ఒకప్పుడు ప్రముఖ నటులుగా, హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెండితెరపై వెలిగిన ఎందరో నటులు.. ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తాజాగా అలనాటి సీనియర్ నటి ఒకరు ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

  దాదాపు 400 వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఆర్ధిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి జయకుమారి. జయకుమారి ప్రస్తుతం చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె తీవ్ర అనారోగ్యంతో శనివారం ప్రభుత్వ దవాఖానాలో జాయిన్ అయ్యారు. ఆమెకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక.. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకుంటున్నారు.

  అయితే ఒకప్పుడు బాగా బతికిన జయకుమారి.. ఆ తరువాత సంపాదించిదంతా పోగొట్టుకున్నారు. జయకుమారి వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిదీ భాషాల్లో ఆమె 400కుపైగా సినిమాల్లో నటించారు. తమిళంలో నాడోడి సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు. అనాథై ఆనందన్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. జయకుమారి భర్త ఎప్పుడో చనిపోయారు. ఆమె భర్త నాగపట్టినం అబ్దుల్లా చాలా కాలం క్రితమే మరణించారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం జయకుమారి కొడుకుతో కలిసి చెన్నైలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chennai, Kollywood, Tollywood

  ఉత్తమ కథలు