సింగర్ సునీత బాటలో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో సీనియర్ నటి..ఎవరో తెలిస్తే...షాక్ తింటారు..

రామ్, సునీత

యాంకర్ ఆలీ సింగర్ సునీత, ఝాన్సీలను ఉద్దేశించి మీరు మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకోబుతున్నారు అంటూ బోల్డ్ గా అడిగేశాడు. దీంతో ఇద్దరూ ఖంగు తిన్నారు.

  • Share this:
    సరిగ్గా 5 నెలల క్రితం ఆలీతో సరదాగా కార్యక్రమంలో సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ ఇద్దరూ కలిసి సరదాగా పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ షోకు ఓ ప్రత్యేకత ఉంది. అందులో యాంకర్ ఆలీ  సింగర్ సునీత, ఝాన్సీలను ఉద్దేశించి మీరు మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకోబుతున్నారు అంటూ బోల్డ్ గా అడిగేశాడు. దీంతో ఇద్దరూ ఖంగు తిన్నారు. నిజానికి ఝాన్సీ కాస్త తేరుకొని మేము ఇద్దరం పెళ్లి ఎలా చేసుకుంటాం. ఇద్దరం ఆడవాళ్లం కదా..అంటూ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు. కానీ కమెడియన్ ఆలీ ఆ ప్రశ్న అడగడం వెనుక ఓ మర్మం ఉంది. ఆయనకు సింగర్ సునీత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది..అనే వార్త చెవిలో పడిఉంటుందని, అందుకే ఆయన అంత ధైర్యంగా సునీతను అలా అడిగి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. నిజానికి సునీత విడాకులు అయ్యాక, సింగిల్ మదర్ గా, ఇద్దరు పిల్లలతో హాయిగా తన కెరీర్ కొనసాగిస్తోంది. అలాగే అటు యాంకర్ ఝాన్సీ సైతం సింగిల్ మదర్ గా కెరీర్ కొనసాగిస్తోంది. వీరిద్దరూ ఆ ఎపిసోడల్ లో సరదాగా గడిపేశారు. సింగిల్ మదర్ గా ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. అంతేకాదు ఇద్దరి జీవితాల్లోని విశేషాలను పంచుకున్నారు. కట్ చేస్తే...సరిగ్గా 5 నెలల తర్వాత సింగర్ సునీతకు వివాహం జరిగి పోయింది. యాంకర్ ఆలీ నోటి చలవ ఏమో కానీ సునీత సడెన్ సర్ ప్రైజ్ తో ముందుకు వచ్చేసింది. సునీత ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ అధిపతి రామ్ వీరపనేనితో ఏడడుగులు వేసేసింది.

    ఇక సింగర్ సునీత చూపించిన బాటలోనే ఇండస్ట్రీలో సింగిల్ మదర్ లుగా కాలం వెళ్లదీస్తున్న మరో సీనియర్ నటి సైతం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహమాడి, ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన ఆమె ప్రస్తుతం సింగిల్ మదర్ గా ఉంటున్నారు. కాగా సింగర్ సునీత ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ తో తాము కూడా తోడు కోసం మరోసారి ఏడడుగులు వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం సడెన్ సర్ ప్రైజ్ ఇఛ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సింగర్ సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరు కావడం విశేషం.
    Published by:Krishna Adithya
    First published: