Sudigali Sudheer: ఈటీవీ లో ప్రసారమవుతున్నా జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికి తెలిసిందే. ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ లో అడుగుపెట్టి వెండితెరపై కూడా మెప్పిస్తున్నారు. అంతేకాకుండా అందులో యాంకర్ గా చేసే శ్రీముఖి, రష్మీ లు ఈ షో నుండే మంచి గుర్తింపు అందుకున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి రోజా స్థానంలో ఇంద్రజ జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.
జడ్జిగా చేసిన ఇంద్రజ కు జబర్దస్త్ నుండి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తన అందంతో, స్మైల్ తో ప్రేక్షకులను జబర్దస్త్ ముందల వాలిపోయేలా చేసింది. గత కొన్ని రోజుల నుండి రోజా తన అనారోగ్యం కారణంగా జబర్దస్త్ దూరంగా ఉండగా ఆ స్థానంలో ఇంద్రజ ను చేర్చారు. ఇక అప్పటినుండి ఇంద్రజ తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమెడియన్స్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ను చూస్తే ముద్దొస్తుంది అంటే నాటీ కామెంట్స్ చేసింది ఇంద్రజ.
తాజాగా వచ్చే గురువారం ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో జడ్జిగా రోజా కనిపించారు. దీంతో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా అందులో జడ్జిగా ఇంద్రజ కనిపించింది. ఇక అందులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ కలిసి స్కిట్ చేయగా.. ఇందులో ఆంటీ పాత్రల్లో కనిపించారు. ఇందులో సుధీర్ ఖైదీ బట్టల్లో ముఖానికి తెల్ల రంగు పూసుకొని.. నమస్తే సార్.. నా పేరు ఆంటీ సార్.. నేను రింగ్ రోడ్డు వేస్తే వాళ్ళకి రింగులు సప్లై చేస్తా అంటూ అమాయకంగా చెబుతాడు. ఇక అతని గెటప్ చూసి ఎంతో మురిసిపోయింది ఇంద్రజ.
ఇక వెంటనే సుడిగాలి సుధీర్ ని చూసి అయ్యో మా అబ్బాయి.. ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడో అంటూ తెగ మురిసిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా.. మొత్తానికి ఇందులో నైనా ఇంద్రజ కనిపించింది అంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra jabardasth, Extra jabardasth promo, Indraja, Indraja Extra Jabardasth, Indraja Jabardasth, Sudigali sudheer, ఇంద్రజ, ఎక్స్ ట్రా జబర్దస్త్, సుడిగాలి సుధీర్