Home /News /movies /

MAA Naresh - Hema: 5 కోట్లలో 3 కోట్లు కూర్చుని స్వాహా చేసారు.. మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ సంచలన ఆరోపణలు..

MAA Naresh - Hema: 5 కోట్లలో 3 కోట్లు కూర్చుని స్వాహా చేసారు.. మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ సంచలన ఆరోపణలు..

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటి చేయబోతున్న హేమ (File/Photo)

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటి చేయబోతున్న హేమ (File/Photo)

MAA Naresh - Hema: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు(MAA Elections) ప్రశాంతంగా జరపడానికి పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళ మధ్య రోజు రోజుకు రచ్చ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళ మధ్య రోజు రోజుకు రచ్చ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రకాశ్ రాజ్ తెగేదాకా లాక్కండి అంటూ ట్వీట్ చేసాడు. మరోవైపు నరేష్ లాంటి వాళ్లు కూడా మీడియా ముందుకొచ్చి వేడెక్కించే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటి హేమ కూడా ఇదే చేసింది. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడం కాదు.. మంట పుట్టిస్తున్నాయి. ఈ సారి ఈమె కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. హేమతో పాటు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, సివిఎల్ నరసింహారావు, జీవిత కూడా ఉన్నారు. అయితే ఎక్కువగా పోటీ మాత్రం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే హేమ చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. మా ఎన్నికలు ఏకగ్రీవం ఉండకుండా చూడాలంటూ ఈమె తన బృందంలోని సభ్యులందరికీ వాయిస్ మేసేజ్‏లు పంపారు. అలాగే మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఈయన సంపాదించింది లేదు కానీ ఉన్నదంతా కూర్చుని ఖర్చు పెడుతున్నాడంటూ ఆరోపించింది హేమ. ఈమె పంపిన వాయిస్ మెసేజ్‌లో ఇలా ఉంది.

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ అందరికీ ఒకేసారి కామన్‌గా పంపిస్తున్నాను.. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను.. మా అసోషియేషన్ ఎలక్షన్స్ పెట్టకూడదు.. నరేష్‌ గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆయన అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించింది లేదు. పైగా ఉన్న డబ్బులనే కూర్చుని మరీ ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఉన్న రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు.. పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం 2.5 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. అప్పట్లో ఆఫీస్ ఖర్చులు ఏమైనా ఉంటే బయటి నుంచి తీసుకొచ్చేవాళ్లం కానీ అకౌంట్‌లో ఉన్న డబ్బులను వాడుకునేవాళ్లం కాదు. కానీ ఇప్పుడాయన అలా కాదు. మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. పైగా ఆ కుర్చీ దిగకూడదు.. ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా మా ఎన్నికలు రావాలి.. అలా మనం సంతకాలు చేయాలి. నేను మనిషిని పంపిస్తాను. సంతకాలు చేసి ఇవ్వండి.. నేను మా అసోసియేషన్‏కు ఇచ్చేస్తా.. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అవి, ఇవీ కట్టేస్తే.. నెక్ట్స్ సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులు మిగలవు. అందుకే మనకు ఎన్నికలు కావాలి అని సంతకాలు పెట్టండి’ అంటూ హేమ వాయిస్ మెసేజ్ పంపింది. ప్రస్తుతం ఈ మాటలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Actress hema, MAA Elections, Naresh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు