Nagma Jayaprada: సుశాంత్ కేసు తప్పుదోవ పట్టించడానికే డ్రగ్స్ రాకెట్.. నగ్మా సంచలనం..

Sushant Singh Rajput Nagma: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2020, 11:57 AM IST
Nagma Jayaprada: సుశాంత్ కేసు తప్పుదోవ పట్టించడానికే డ్రగ్స్ రాకెట్.. నగ్మా సంచలనం..
నగ్మ జయప్రద (nagma jaya prada)
  • Share this:
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది. ముందు చాలా వేగంగా ఈ కేసులో అనేక అనుమానాలతో పాటు విషయాలు కూడా బయటికి వచ్చాయి. ఆ తర్వాత సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. రియా చక్రవర్తితో పాటు మరికొందరు కూడా ఈ విచారణకు వచ్చారు. దాంతో కచ్చితంగా ఈ కేసులో న్యాయం జరుగుతుందని చాలా మంది నమ్మారు కూడా.

నగ్మ (Nagma)
కాంగ్రెస్ నాయకురాలు నగ్మ (Nagma)


అయితే ఇప్పుడు అవి సన్నగిల్లుతున్నాయంటూ సుశాంత్ అభిమానులు మండి పడుతున్నారు. దానికి కారణం సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికి డ్రగ్స్ కుంభకోణం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు సుశాంత్ కేసు కంటే కూడా మాదకద్రవవ్యాల కేసుపైనే అంతా ఫోకస్ చేసారు. పైగా చాలా రాజకీయ పార్టీలు కూడా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ సుశాంత్ గురించి మాత్రం కాదు. ఇప్పుడు ఇదే విషయంపై సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా సంచలన వ్యాఖ్యలు చేసింది.

డ్రగ్స్ ముసుగులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు నీరుగార్చడానికి బిజేపీ ప్రయత్నం చేస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నాయకురాలు, సీనియర్‌ నటి జయప్రదను టార్గెట్‌ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది నగ్మా. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి ఈ డ్రగ్స్ రాకెట్‌ను బిజేపీ తెరపైకి తీసుకొస్తుందని ట్వీట్ చేసింది నగ్మా.

జయప్రద (Jaya prada)
జయప్రద (Jaya prada)


‘సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ దయచేసి మీరంతా సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఏం జరుగుతుందో అప్‌డేట్స్ బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి.. ఆయన చనిపోయి మూడు నెలలు గడిచిపోయింది.. అభిమానులతో పాటు దేశ ప్రజలంతా కూడా సుశాంత్‌ మృతికి కారణం ఏంటి.. దానికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదు.. ఇప్పుడు దీన్ని కవర్‌ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ నగ్మా ట్వీట్ చేసింది.

నగ్మ జయప్రద (nagma jaya prada)
నగ్మ జయప్రద (nagma jaya prada)


బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం ఎక్కువగా ఉందంటూ ఎంపీ రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చింది. దాంతో నగ్మా ఈ మాజీ హీరోయిన్‌పై విరుచుకుపడింది. సుశాంత్ కేసును తప్పుదోవ పట్టించడానికే డ్రగ్స్ మాఫియాను తెరపైకి తీసుకొచ్చారని చెప్తుంది నగ్మా. మరోవైపు టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ అంటూ ప్రారంభమైన ఈ విషయం.. ఆ తర్వాత జస్టిస్ ఫర్ కంగన.. ఇప్పుడు జస్టిస్‌ ఫర్‌ రవి కిషన్‌ అయ్యింది.. మరి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎక్కడ అంటూ ట్వీట్‌ చేసింది కావ్యా. ఏదేమైనా కూడా సుశాంత్ కేసు మాత్రం బాలీవుడ్‌లో అనేక మలుపులు తిరుగుతుంది. మరి ఇందులో చివరికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 18, 2020, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading