SENIOR ACTRESS AAMANI REVELED THE SECRET BEHIND WHY LATE ACTRESS SOUNDARYA NOT EXPOSED HER CAREER PK
Soundarya - Aamani: సౌందర్య ఎక్స్పోజింగ్ చేయకపోవడానికి కారణం చెప్పిన నటి ఆమని..
సౌందర్య ఫోటోస్ (Soundarya photos/twitter)
Soundarya - Aamani: సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే..
సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సౌందర్యకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. ఇదిలా ఉంటే 13 ఏళ్ల కెరీర్లో గ్లామర్ షోకు మాత్రం దూరంగానే ఉంది సౌందర్య.
సౌందర్య ఫోటోస్ (Soundarya photos/twitter)
తనకు పోటీగా అప్పట్లో రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్ర హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ దూసుకుపోతున్నా కూడా సౌందర్య మాత్రం ఏ సినిమాలో కూడా హద్దులు దాటలేదు. అప్పుడప్పుడూ నడుము చూపించడం వరకు ఓకే కానీ అంతకుమించి ఒక్కసారి కూడా హద్దు దాటలేదు. ఏ మాత్రం అందాలు ఆరబోయకుండా నెంబర్ వన్ హీరోయిన్గా పదేళ్ల పాటు చక్రం తిప్పింది సౌందర్య. అంతటి ఇమేజ్ సంపాదించుకోవడం ఈ తరం హీరోయిన్లకు సాధ్యమయ్యే పని కాదు.
సౌందర్య ఫోటోస్ (Soundarya photos/twitter)
అప్పట్లో ఇండస్ట్రీలో సౌందర్యకు స్నేహితులు కూడా తక్కువే. హీరోల్లో జగపతిబాబు, శ్రీకాంత్.. హీరోయిన్లలో ఆమనితో ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది ఈమె. ఇప్పుడు సీనియర్ నటి ఆమని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో నటించిన ఈమె.. యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. అక్కడ సౌందర్య గురించి టాపిక్ వచ్చినపుడు తానెందుకు ఎక్స్పోజింగ్ చేయలేదో కారణం చెప్పిందని తెలిపింది ఆమని.
సౌందర్య ఫోటోస్ (Soundarya photos/twitter)
తాము ఇద్దరమే షూటింగ్లో ఉన్నపుడు.. ఎక్స్పోజింగ్ గురించి అడిగానని చెప్పింది ఆమని. దానికి వెంటనే.. ఎందుకే ఎక్స్పోజ్ చేయాలి.. రేపు పెళ్లై మొగుడు పక్కనే ఉన్నపుడు తన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది.. మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అలా గ్లామర్ షో చేసినపుడు అంటూ సమాధానం చెప్పిందని గుర్తు చేసుకుంది ఆమని. అందుకే కెరీర్లో సౌందర్య ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చేయలేదని చెప్పుకొచ్చింది ఆమని. అంత ధైర్యం ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. అందుకే సౌందర్య అంటే ఎప్పటికీ ఓ చరిత్ర అంతే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.