SENIOR ACTRESS AAMANI REVEALS THE REASON BEHIND WHY SHE DIDNT GET MARRY SOUNDARYA BROTHER AMAR MNJ
Aamani: సౌందర్య సోదరుడిని అందుకే పెళ్లి చేసుకోలేకపోయా.. అసలు విషయం బయటపెట్టిన ఆమని
సౌందర్య ఆమని
తెలుగు సినీ పరిశ్రమలో ఆమనికి ప్రత్యేక స్థానం ఉంది. తన నటనతో అందరినీ మెప్పించి పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ నటి.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలకు అమ్మ పాత్రల్లో ఆమె మెప్పిస్తున్నారు.
Aamani- Soundarya: జంబలకిడి పంబ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమని.. అప్పట్లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఏదో కమర్షియల్ హీరోయిన్గా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే ఆమె మెరిశారు. ముఖ్యంగా మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిచిగురు తదితర చిత్రాల్లో ఆమని నటన మరవలేనిది. ఆ పాత్రల్లో ఆమె తప్ప మరెవరు నటించలేరు అన్న చందాన నటించిన ఆమని.. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కాగా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఆమని.. రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం హత్య మూవీతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. అప్పుడు కూడా పలు మూవీల్లో నటించిన ఆమని.. ఎంసీఏ చిత్రంలో మూడో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. ఇప్పుడు పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మళ్లీ బిజీ అయ్యారు. కాగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆమని.. పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సౌందర్య సోదరుడు అమర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారో బయటపెట్టారు ఆమని.
హీరోయిన్లలో నాకు సౌందర్య చాలా క్లోజ్. వాళ్ల ఫ్యామిలీతోనూ చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. అమర్‌ని చేసుకోమని సౌందర్య వాళ్ల నాన్న నన్ను అడిగారు. అప్పుడు నేను, సౌందర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము కానీ నేను ఏం చెప్పలేకపోయా. అప్పుడు ఎలానో మేనేజ్ చేశా. సౌందర్య వాళ్ల నాన్న నన్ను అడిగినప్పుడు తెలంగాణ శకుంతల కూడా నా పక్కన ఉన్నారు. కానీ అమర్‌కి కాలేజ్ టైమ్ నుంచి ఒక లవ్ ఎఫైర్ ఉండేది. ఆ విషయం సౌందర్య వాళ్ల నాన్నకు తెలీకనే నన్ను అడిగారు. ఇక సౌందర్య వాళ్ల నాన్న చనిపోయిన తరువాత అమర్ పెళ్లి చేసుకున్నారు అని గుర్తు చేసుకున్నారు.
ఆ తరువాత సౌందర్య, అమర్ ఇద్దరూ చనిపోయారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో నేను, శకుంతల మళ్లీ కలిశాము. అప్పుడు శకుంతల గుర్తు చేశారు. అయితే అలా చేసుకుని ఉంటే నేను ఇప్పుడు బాధపడేదాన్నేమో అని చెప్పాను. దానికి శకుంతల.. అలా ఎందుకు అనుకుంటావమ్మా. నీ మాంగళ్య బలం గట్టిగా ఉంటే ఉండేవారేమో అని అన్నారు. అయినా మనకు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని ఆమని చెప్పుకొచ్చారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.