SENIOR ACTOR SUMAN MADE SOME INTERESTING COMMENTS ON TOLLYWOOD RECENT ISSUE SRD
Tollywood : టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్ద ఎవరన్న ఇష్యూపై ఒకప్పటి స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..
Chiranjeevi - Mohanbabu
Tollywood : టాలీవుడ్ (Tollywood)లో ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్ ఖాళీగా ఉంది. అదే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇప్పటి వరకు ఎలిజిబులిటీగా భావించిన చిరంజీవి (Megastar Chiranjeevi) ఆ పోస్ట్ తనకొద్దన్నారు. దీంతో ఆ పెద్దరికం పోస్ట్ కోసం మోహన్‌బాబు (Mohanbabu) పోటీ పడుతున్నాడని సమాచారం.
టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్ ఖాళీగా ఉంది. అదే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇప్పటి వరకు ఎలిజిబులిటీగా భావించిన చిరంజీవి (Megastar Chiranjeevi) ఆ పోస్ట్ తనకొద్దన్నారు. దీంతో ఆ పెద్దరికం పోస్ట్ కోసం మోహన్‌బాబు (Mohanbabu) పోటీ పడుతున్నాడని సమాచారం. నాలుగేళ్ల క్రితం వరకు దర్శకరత్న దాసరి నారాయణ రావు (Dasari Naryanarao) తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా భావించారు. ఇండస్ట్రీలో కార్మికులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరి మధ్య సమస్యలున్నా దాసరి మాట్లాడి సాల్వ్ చేసేవాడనే టాక్ ఉండేది. దీంతో ఆయన్ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించారు. అందుకే ఆయన పెద్దరికాన్ని చాలా వరకు అంగీకరించారు. కానీ దాసరి మరణంతో ఆ పెద్ద దిక్కు లేదనే మాట తరచూ వినిపిస్తుంది. మరోసారి..టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల అనంతరం ఎవరూ దీని ఊసే ఎత్తలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు.
కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోహన్ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలంటూ లేఖలో పేర్కొన్నాడు.
దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేదానిపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ అంశపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, హీరో సుమన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
" నేను సినిమాల్లోకి వచ్చిన 44 ఏళ్లు అవుతుంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా రంగంలో ఐక్యత లేదనడం అవాస్తవం. పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల సమస్యను ప్రభుత్వం చర్చించి త్వరలో పరిష్కరించాలి" అని ఆయన వ్యాఖ్యానించాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.