సీనియర్ నటుడు రాళ్లపల్లి ఇకలేరు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంత లోకాలకు...

1973లో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి... 8 వేలకు పైగా నాటకాల్లో నటించి, దర్శకత్వం కూడా వహించిన సీనియర్ నటుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 8:47 PM IST
సీనియర్ నటుడు రాళ్లపల్లి ఇకలేరు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంత లోకాలకు...
నటుడు రాళ్లపల్లి నర్సింహారావు
  • Share this:
సీనియర్ నటుడు రాళ్లపల్లి తనువు చాలించారు. 850 పైగా సినిమాల్లో నటించిన సీనియర్ మోస్ట్ నటుడు, రంగస్థల నటుడు అయిన రాళ్లపల్లి నర్సింహా రావు... హైదరాబాద్‌లోని మెడీక్యార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (మే 17, 2019) మరణించారు. 1955, అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించిన రాళ్లపల్లి... తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ‘చిల్లరదేవుళ్లు’, ‘చలిచీమలు’, ‘అభిలాష’ వంటి ఎన్నో చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన రాళ్లపల్లి... హస్యదర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో నటించారు. దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘అన్వేషణ’ సినిమాలో విలన్ పాత్రలోనూ మెప్పించిన రాళ్లపల్లి... ‘లేడీస్ ట్రైలర్’, ‘ఏప్రిల్ 1న విడుదల’, ‘కన్నయ్య కిట్టయ్య’ వంటి సినిమాల్లో మంచి పాత్రల్లో కిపించారు. సినిమాల్లోకి రాకముందు నుంచే నాటకాల్లో ప్రవేశించిన రాళ్లపల్లి నరసింహారావు... అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరేదాకా నాటకాలు వేస్తూనే ఉన్నారు. దాదాపు 8 వేల నాటకాల్లో నటించిన రాళ్లపల్లి... చాలా నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణికి గురువు, మార్గదర్శిగా పేరొందిన రాళ్లపల్లి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. మంచి నటుడిగానే కాకుండా మంచి వంటవాడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాళ్లపల్లి. ఇప్పుడు స్టార్లుగా వెలిగిపోతున్న కమల్ హాసన్, బాలకృష్ణ వంటి హీరోలతో పాటు సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్, కోదండరామిరెడ్డి వంటి వాళ్లకు షూటింగ్‌ సమయాల్లో తన వంటను రుచిచూపించారు రాళ్లపల్లి.

రాళ్లపల్లి నటించిన కొన్ని సినిమాలు. ‘సితార’, ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’, ‘జోకర్’, ‘అలాపన’, ‘బొంబాయి’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘ఖైైదీ’, ‘సీతాకోకచిలుక’,‘శుభలేఖ’... సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారు రాళ్లపల్లి. చిలకమర్తి లక్ష్మీనరసింహాం గారి రచనలో వచ్చిన ‘గణపతి’ సీరియల్‌లో నటించిన రాళ్లపల్లి ఉత్తమ సహాయనటుడిగా నంది అందుకున్నారు. ‘జననీ జన్మభూమి’ సీరియల్‌తో పాటు చాలా బుల్లితెర నాటకాల్లో నటించారు రాళ్లపల్లి.
First published: May 17, 2019, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading