రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రకాశ్ రాజ్ సపోర్ట్.. అసెంబ్లీలోనే దుకాణం..

రాహుల్ సిప్లిగంజ్‌ను సపోర్ట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ (rahul prakash raj)

Rahul Sipligunj: బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై నాలుగు రోజుల కింద పబ్‌లో జరిగిన దాడి సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో రాజకీయ కోణాలు కూడా బయటికి వస్తున్నాయి. అక్కడ దాడి చేసిన వాళ్లకు పొలిటికల్ బ్యాగ్రౌండ్..

  • Share this:
బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై నాలుగు రోజుల కింద పబ్‌లో జరిగిన దాడి సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో రాజకీయ కోణాలు కూడా బయటికి వస్తున్నాయి. అక్కడ దాడి చేసిన వాళ్లకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. చివరికి రాహుల్ ఈ తప్పు చేసాడని ఆయనపైనే రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన సన్నిహితులు కూడా వాపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ నుంచి కూడా రాహుల్‌ను సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం కూడా ఆశ్చర్యపరుస్తుంది. పబ్ గొడవ కావడంతో ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు రాహుల్ మాత్రం తనకు న్యాయం జరగాల్సిందే అంటూ కేటీఆర్‌కు కూడా ట్వీట్ చేసాడు.

రాహుల్ సిప్లిగంజ్‌ను సపోర్ట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ (rahul prakash raj)
రాహుల్ సిప్లిగంజ్‌ను సపోర్ట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ (rahul prakash raj)


రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ఇలా దాడులు చేస్తుంటే మన సమాజం ఏమైపోవాలంటున్నాడు ఈయన. ఇప్పుడు రాహుల్‌కు సపోర్టుగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వచ్చాడు. ఆ రోజు పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పేం లేదని సర్టిఫికేట్ ఇచ్చేసాడు ప్రకాశ్ రాజ్. ఆ గొడవలో తప్పు మొత్తం అవతలి వాళ్లే చేసారని.. ఎంత పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అంటున్నాడు ఈయన. ఇదే విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను కూడా అసెంబ్లీలో కలిసారు ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్.

కేటీఆర్ రాహుల్ సిప్లిగంజ్ (ktr rahul sipligunj)
కేటీఆర్ రాహుల్ సిప్లిగంజ్ (ktr rahul sipligunj)


కేసును కొట్టేసి.. కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేసినా కూడా అలాంటిదేం జరగదని చెబుతున్నాడు ప్రకాశ్ రాజ్. రాహుల్ తప్పు చేయనపుడు ఎందుకు కాంప్రమైజ్ కావాలని ప్రశ్నిస్తున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు. ఈ మధ్యే అంతా కలిసి ప్రకాశ్ రాజ్ ఫామ్‌హౌజ్‌లో పెద్ద పార్టీ కూడా చేసుకున్నారు. అప్పుడే రాహుల్ ఈయనకు బాగా క్లోజ్ అయ్యాడు.
Published by:Praveen Kumar Vadla
First published: