వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు.. కమల్, రజినీకాంత్ ఆర్థిక సాయం..

Ponnambalam Kamal Haasan: అసలే సినిమా ఇండస్ట్రీకి 2020 అస్సలు కలిసి రావడం లేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంతో వణికిపోతున్నారు సినిమా వాళ్లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2020, 5:57 PM IST
వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు.. కమల్, రజినీకాంత్ ఆర్థిక సాయం..
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)
  • Share this:
అసలే సినిమా ఇండస్ట్రీకి 2020 అస్సలు కలిసి రావడం లేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంతో వణికిపోతున్నారు సినిమా వాళ్లు. ఇప్పటికే దాదాపు 40 మంది సినీ ప్రముఖులు ఈ ఏడాది చనిపోయారు. అందులో చిరంజీవి సర్జ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది. తాజాగా ఓ లెజెండరీ నటుడు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అంతేకాదు ఆర్థిక సాయం కోసం వీడియో కూడా విడుదల చేసాడు.
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)

తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన నటుడు పొన్నాంబళం అందరికీ తెలిసిన వాడే. ఈయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పొన్నాంబళం తన పరిస్థితిని వీడియో రూపంలో విడుదల చేసాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ మాస్క్‌తో ఊపిరి తీసుకుంటున్న పొన్నాంబళం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇది చూసిన వెంటనే లోక నాయకుడు కమల్ హాసన్ స్పందించాడు.
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)

పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా ఆయనకు ఆర్థిక సాయం కూడా చేస్తానని మాటిచ్చాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడి పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాడు కమల్ హాసన్. అంతేకాదు తన సిబ్బందిని అక్కడే ఉంచి ఎప్పటికప్పుడు పొన్నాంబళంపరిస్థితి తెలుసుకుంటున్నాడు. మరోవైపు రజినీకాంత్ కూడా పొన్నాంబళంకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఈయన కూడా హాస్పిటల్ నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నాడు.
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)
పొన్నాంబళంకు అండగా నిలిచిన రజినీ, కమల్ (ponnambalam kamal rajinikanth)

ఇదిలా ఉంటే స్టంట్ మ్యాన్ అనే చిత్రంతో పరిచయం అయిన పొన్నాంబళం... కమల్ హాసన్, రజనీకాంత్ సహా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితోనూ నటించాడు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించాడు పొన్నాంబళం. ఈయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Published by: Praveen Kumar Vadla
First published: July 11, 2020, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading