Home /News /movies /

MAA Elections 2021: ఇండస్ట్రీలో భూ కబ్జాలు, వ్యభిచారం, డ్రగ్స్ ఉంది.. సీనియర్ నటుడు CVL నరసింహారావు..

MAA Elections 2021: ఇండస్ట్రీలో భూ కబ్జాలు, వ్యభిచారం, డ్రగ్స్ ఉంది.. సీనియర్ నటుడు CVL నరసింహారావు..

సీనియర్ నటుడు సివిఎల్ నరసింహా రావు (CVL Narasimha Rao)

సీనియర్ నటుడు సివిఎల్ నరసింహా రావు (CVL Narasimha Rao)

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు(MAA Elections 2021) వస్తున్నాయంటే చాలు.. ఎక్కడలేని వివాదాలు, గొడవలు అన్నీ బయటికి వస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో వ్యభిచారం చేసే వాళ్ళు, డ్రగ్స్‌కు బానిసగా మారిన వాళ్ళు, భూకబ్జాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు సివిఎల్ నరసింహా రావు(CVL Narasimha Rao).

ఇంకా చదవండి ...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎక్కడలేని వివాదాలు, గొడవలు అన్నీ బయటికి వస్తుంటాయి. అప్పటి వరకు మేమంతా ఒక్కటే అంటూ రాగం పాడిన వాళ్లు కూడా.. ఎన్నికల సమయంలో మాత్రం మీకు మీరే.. మాకు మేమే అంటూ కొత్త పాట అందుకుంటారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో అంచనా వేయడం కూడా కష్టమే. ఏ గూటి పక్షి ఏదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఏ ముహూర్తంలో ప్రకాశ్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాని చెప్పాడో.. అప్పట్నుంచి ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. మంచు విష్ణు, హేమ, జీవిత ఇలా చాలా మంది అధ్యక్ష బరిలో దిగుతున్నారు. వీళ్లందరికీ తోడు ఇప్పుడు సీనియర్ నటుడు, న్యాయవాది సివిఎల్ నరసింహారావు కూడా మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. ఈయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకు పోటీ చేస్తున్న వాళ్ళంతా అసోసియేషన్ బాగు కోసం.. ఆర్థిక ఇబ్బందులను తొలగించడం కోసం.. అన్నింటి కంటే ముఖ్యంగా బిల్డింగ్ కట్టించడం కోసం వస్తున్నామని చెప్పారు. కానీ సివిఎల్ మాత్రం కొత్త వాదంతో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. అదే తెలంగాణ వాదం.

కళాకారులకు ప్రాంతంతో సంబంధం లేదని.. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఉండరని ప్రకాశ్ రాజ్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ వేర్పాటు వాదమే నినాదంగా వస్తున్నాడు సీనియర్ నటుడు నరసింహారావు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరులో ఇంకా ఏపీ అనే పదం ఎందుకు ఉందని ఈయన ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు.. తెలంగాణ కళాకారుల కోసం పాటు పడాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పాడు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ రావాలని ఆయన బలంగా వాదిస్తున్నాడు.

CVL Narasimha Rao,CVL Narasimha Rao tollywood actor,CVL Narasimha Rao maa president,CVL Narasimha Rao vijayashanti,CVL Narasimha Rao kcr,CVL Narasimha Rao tollywood drugs case prostitution,సివిఎల్ నరసింహారావు,టాలీవుడ్‌పై సివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు,భూ కబ్జాదారులు వ్యభిచారం డ్రగ్స్ ఉన్నాయంటూ టాలీవుడ్‌పై సివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు సివిఎల్ నరసింహా రావు (CVL Narasimha Rao)


ఈయనకు విజయశాంతి కూడా అండగా నిలిచింది. నరసింహారావు చెప్పిన దాంట్లో నిజం ఉందని ఆమె తెలిపింది. కరోనా కోరల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది పేద కళాకారులు బయట తిండి లేక అల్లాడిపోతున్నారని.. వాళ్లకు ముందు అన్నం పెట్టండి అంటూ విమర్శలు చేసాడు నరసింహారావు. బిల్డింగులు కడతాం.. కోట్లు ఖర్చు పెడతాం కాదు.. ముందు వెళ్లి వాళ్ల కడుపు నింపండి అంటూ ఆయన కోరుకుంటున్నాడు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

తెలుగు ఇండస్ట్రీలో వ్యభిచారం చేసే వాళ్ళు, డ్రగ్స్‌కు బానిసగా మారిన వాళ్ళు, భూకబ్జాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు సివిఎల్ నరసింహా రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బిజీగా ఉండే వీటి గురించి పట్టించుకోవడం లేదు కానీ.. ఆయన కాని దృష్టి పెడితే 5 నిమిషాల్లో మొత్తం క్లీన్ అవుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తోనూ ఈ విషయం గురించి మాట్లాడతానని చెప్పాడు ఈయన. ప్రస్తుతం సివిఎల్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి ఈయన చెప్పిన ఆ భూకబ్జా దారులు, వ్యభిచారం చేసే వాళ్లు, దందాల్లో ఉన్న వాళ్లు, డ్రగ్స్ బానిసలు ఎవరో మరి..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు