కొన్నిసినిమాలకు భాషతో సంబంధం ఉండదు. ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలు.. సినిమా సూపర్‌హిట్టే. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇలాంటి లిస్టులో ఉన్న సినిమా యుగానికి ఒక్కడు. సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈయన తమిళంలో డైరెక్ట్ చేసిన బృందావన కాలనీ తెలుగులోనూ సెన్సేషనల్ హిట్. అలాగే తెలుగులో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాను వెంకటేశ్‌తో తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఈయన తమిళంలో తెరకెక్కించిన ఆయురత్తిల్ ఒరువన్ సినిమాకు తెలుగు అనువాదమే యుగానికి ఒక్కడు. ఇది చోళులు, పాండ్యుల మధ్య జరిగే పోరుకు సంబంధించిన సినిమా. కానీ తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. సినిమా తెరకెక్కిన తీరు అలా ఉంటుంది మరి.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్. ఆయిరత్తిల్ ఒరువన్ 2 అని తమిళంలో, తెలుగులో యుగానికి ఒక్కడు అని విడుదలవుతుంది. అయితే ఈ సినిమా 2024లోనే విడుదలవుతుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. యుగానికి ఒక్కడు సినిమాలో కార్తి హీరోగా నటించాడు. సీక్వెల్లోనూ ఆయన హీరోగా నటిస్తాడని అందరూ అనుకుంటే, సెల్వ రాఘవన్ హీరోనే మార్చేశాడు. కారణమేంటో ఎవరికీ తెలియడం లేదు. కార్తి స్థానంలో ధనుశ్ హీరోగా నటిస్తున్నాడు. యుగానికి ఒక్కడు సినిమాలో నటించినవారే ఈ సినిమాలో నటిస్తారా లేక.. యాక్టర్స్ మారుతారా? అనేది తెలియాల్సి ఉంది.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ యువకుడు కొండ పైనుండి కింద ఉన్న పర్వతాలను చూస్తుంటాడు. తొలిభాగమైన యుగానికి ఒక్కడు సినిమాకు ఇది కొనసాగింపుగా ఉంటుందనడానికి ఇదే ప్రూఫ్‌గా కనిపిస్తోంది.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.