హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudher- Sekhar Master: అందరూ చూస్తుండగానే.. సుధీర్‌ను శేఖర్ మాస్టర్ అన్ని మాటలన్నాడా..? ఆగ్రహంలో ఫ్యాన్స్

Sudigali Sudher- Sekhar Master: అందరూ చూస్తుండగానే.. సుధీర్‌ను శేఖర్ మాస్టర్ అన్ని మాటలన్నాడా..? ఆగ్రహంలో ఫ్యాన్స్

సుడిగాలి సుధీర్ శేఖర్ మాస్టర్

సుడిగాలి సుధీర్ శేఖర్ మాస్టర్

Sudigali Sudheer- Sekhar Master: బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్‌కి ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. ఆ త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నాడు. రాను రాను సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డంతో పాటు హీరోగానూ చేస్తున్నాడు. ఆ మ‌ధ్య‌న యాంక‌ర్‌గా కూడా ఆక‌ట్టుకున్నాడు.

ఇంకా చదవండి ...

  Sudigali Sudheer- Sekhar Master: బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్‌కి ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. ఆ త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నాడు. రాను రాను సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డంతో పాటు హీరోగానూ చేస్తున్నాడు. ఆ మ‌ధ్య‌న యాంక‌ర్‌గా కూడా ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌లో క‌మెడియ‌న్‌గా కొన‌సాగుతున్న ఈ న‌టుడు.. డ్యాన్స్ రియాలిటీ షో ఢీలోనూ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్‌గా జ‌రుగుతున్న ఈ సీజ‌న్‌కి మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదితో క‌లిసి కింగ్స్ జ‌ట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. కాగా ఈ షోలో మామూలుగానే సుధీర్‌పై జోకులు ప‌డుతుంటాయి. రౌండ్లు పూర్తైన ప్ర‌తిసారి సుధీర్‌పై ఏవో కామెంట్లు వేస్తూనే ఉంటారు. వ్యాఖ్యాత ప్ర‌దీప్ మొద‌లు కో మెంటార్ ఆది, జ‌డ్జిలు శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇలా ప‌లువురు సుధీర్‌పై కామెంట్లు చేస్తూనే ఉంటారు. వీక్ష‌కుల‌కు ఒక్కొక్కసారి అవి శృతిమించిన‌ట్లు అనిపిస్తుంటాయి కూడా. అయితేనేం సుధీర్ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అవి అలానే కొన‌సాగుతున్నాయి.

  ఇదిలా ఉంటే ఢీ 13కు సంబంధించి లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది. అందులో స్కూల్ కాలేజ్‌ థీమ్‌తో కంటెస్టెంట్‌లు డ్యాన్స్‌లు వేశారు. ఇక ఎప్ప‌టిలాగే సుధీర్‌పై జోకులు వేశారు శేఖ‌ర్ మాస్ట‌ర్. ఏరా సుధీర్‌గా అంటూ ప‌దే ప‌దే శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటూ వ‌చ్చాడు. దానికి సుధీర్ కూడా కాస్త షాక్ అయిన‌ట్లు మొహం పెట్టాడు. ఇక ప్రొడ‌క్ష‌న్ టీమ్ నుంచి ఏయ్ అంటూ సౌండ్లు రాగా.. ఆయ‌న వేస్తున్నాడు క‌దారా సుధీర్ అన్నాడు.

  ' isDesktop="true" id="787596" youtubeid="F-7QAwF9NlY" category="movies">

  కాగా ఈ కామెంట్లు ఎప్ప‌టిలాగే సుధీర్ ఫ్యాన్స్‌ని హ‌ర్ట్ చేస్తున్నాయి. ఆ ప్రోమో వీడియో కింద సుధీర్‌ని అనేముందు నోరు జాగ్ర‌త్త‌గా పెట్టుకోండి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే గ‌తంలోనూ సుధీర్‌ని అన్న ప్ర‌తిసారి అభిమానులు కామెంట్లు పెట్టారు. అత‌డు త‌న స్వ‌శ‌క్తితో ఇంత‌వ‌ర‌కు వ‌చ్చాడ‌ని, సుధీర్‌పై జోకులు వేయ‌డం ఆపాల‌ని ఫ్యాన్స్ చాలా సార్లు ఫైర్ అయ్యి వీడియోలు కూడా పెట్టారు. కామెడీ అంటే కొంత ప‌రిధి ఉంటుందని.. కానీ సుధీర్‌ని ప్ర‌తిసారి టార్గెట్ చేస్తున్నార‌ని అత‌డి అభిమానులు ఫీల్ అయ్యి కామెంట్లు పెట్టిన విష‌యం తెలిసిందే.

  Published by:Manjula S
  First published:

  Tags: Sudigali sudheer

  ఉత్తమ కథలు