Sekhar Kammula: రానాకు షాక్ ఇచ్చిన శేఖర్ కమ్ముల... స్టార్ హీరోతో లీడర్‌ సీక్వెల్‌కు ప్లాన్..

Sekhar Kammula Photo : Twitter

Sekhar Kammula: రానా దగ్గుబాటి హీరోగా నటించిన మొదటి సినిమా లీడర్ గురించి మాట్లాడుతూ... ఈ లీడర్ సినిమాకు స్వీక్వెల్ తప్పకుండా తెరకెక్కిస్తానని శేఖ‌ర్ పేర్కోన్నారు. అయితే ఈ చిత్రానికి రాబోయే సీక్వెల్‌లో రానా హీరోగా కాకుండా ఓ స్టార్ హీరోతో సినిమా వస్తుందని టాక్. దీనికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • Share this:
  శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సెన్సెబుల్ డైరెక్ట‌ర్. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాలు తీయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటారు. ఇక ఆయన దర్శకత్వంలో ఇటీవల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ (Love story). అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 24 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక అది అలా ఉంటే ఇటీవల శేఖర్ కమ్ముల ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ.. త‌న నెక్ట్ ప్రాజెక్ట్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. రానా దగ్గుబాటి హీరోగా నటించిన మొదటి సినిమా లీడర్ గురించి మాట్లాడుతూ... ఈ లీడర్ సినిమాకు స్వీక్వెల్ తప్పకుండా తెరకెక్కిస్తానని శేఖ‌ర్ పేర్కోన్నారు. అయితే ఈ చిత్రానికి రాబోయే సీక్వెల్‌లో రానా హీరోగా కాకుండా ఓ స్టార్ హీరోతో సినిమా వస్తుందని టాక్. దీనికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  లీడర్‌కు (Leader Sequel) వచ్చే సీక్వెల్‌లో రానాకు బదులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటీకే ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా ఉన్నారు. కాబ‌ట్టి ఆయనకు ఈ చిత్రం మరింత ఫ్ల‌స్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా సరిగ్గా 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

  Nani | Dasara : నాని సినిమాకు భారీగా డిమాండ్ చేస్తోన్న కీర్తి సురేష్..

  ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరి తర్వాత తమిళ హీరో ధనుష్‌ (Dhanush)తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నారు. సున్నిత అంశాలతో ప్రేమకథ చిత్రాలను రూపోందించే శేఖర్ కమ్ముల ధనుష్‌ను ఎలాంటీ కథతో, అసలు ఏ నేపథ్యంలో చూపబోతున్నారన్న ఆసక్తి ధనుష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు ఉంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ తాజా సినిమా కూడా పొలిటికల్ డ్రామా జానర్‌లోనే వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా ఒకప్పటి మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా టాక్ నడుస్తోంది.

  Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... అనుకున్న సమయం కంటే ముందే...

  ఆ కారణంగానే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం మొదట ధనుష్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్స్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం. ఈ సినిమాను నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.

  ధనుష్ ఇప్పటివరకు డైరెక్ట్‌గా తెలుగు సినిమాని కానీ, తెలుగు దర్శకులతో కానీ సినిమా చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్నట్లు టాక్.
  Published by:Suresh Rachamalla
  First published: