Sekhar Kammula: సీనియర్ స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ.. ఈ సారి మాత్రం ఛాయ్ లాంటి సినిమా..

శేఖర్ కమ్ముల (Twitter/Photo)

Sekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన సినిమాల కంటూ ప్రత్యేక అభిమానులున్నారు. తాజాగా ఈయన సీనియర్ టాప్ హీరోతో మాస్ తరహా సినిమా తెరకెక్కించనున్నాడు.

  • Share this:
    Sekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన సినిమాల కంటూ ప్రత్యేక అభిమానులున్నారు. అంతేకాదు దర్శకత్వ ప్రతిభతో  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేసారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో పాటు సారంగదరయా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూట్‌లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ మూవీ కూడా కన్ఫామ్ చేసాడు. ఈయనతో ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న ప్రొడ్యూసర్ నారాయణ దాస్ నారంగ్ తమ నెక్ట్స్ మూవీని కూడా శేఖర్ కమ్ములతో చేయడానికి రెడీ అయ్యారు.

    sekhar kammula next movie with senior hero venkatesh,sekhar kammula,venkatesh,sekhar kammula venkatesh,venkatesh naarappa,venkatesh twitter,sekhar kammula twitter,sekhar kammula instagram,sekhar kammula facebook,venkatgesh facebook,venkatesh instagram,sekhar kammula venkatesh movie,sekhar kammula next movie with senior hero venkatesh,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,వెంకటేష్,శేఖర్ కమ్ముల వెంకటేష్,వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల వెంకటేష్,వెంకటేష్ నారప్ప
    వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల (Twitter/Photos)


    లవ్ స్టోరీ తర్వాత తెరకెక్కబోయే సినిమాలో విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వెంకటేష్‌తో ఓ కథను నేరేట్ చేసినట్టు సమాచారం. వెంకటేష్‌తో లీడర్ తరహా కొంచెం యాక్షన్ టచ్ ఉన్న సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ రైల్వే కూలీ పాత్రలో కనిపంచబోతున్నట్టు సమాచారం. రైల్వే కూలీ ఎలా లీడర్‌గా ఎదగడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. మొత్తంగా శేఖర్ కమ్ముల శైలిలో సాగే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ‘లీడర్’ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్.. నారప్ప సినిమా మే 14న విడుదల కానుంి. మరోవైపు వెంకటేస్ నటిస్తోన్న ‘ఎఫ్ 3’ మూవీని ఆగష్టు 27న విడుదల చేయనున్నారు. మరోవైపు వెంకటేష్ నటిస్తోన్న ‘దృశ్యం 2’ సినిమాను కూడా ఈ యేడాదే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: