నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరికి అదిరిన డిమాండ్.. భారీ ధరకు రైట్స్..

శేఖర్ కమ్ముల.. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 1, 2020, 10:58 AM IST
నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరికి అదిరిన డిమాండ్.. భారీ ధరకు రైట్స్..
నాగ చైతన్య, సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక అప్పటినుండి సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ జరుపుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. దీనికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు సమాచారం. ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.

ఇక మరోవైపు శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో కూడా మంచి డిమాండ్ ఉందట. మొత్తంగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టు తాజా సమాచారం. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఈయన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
First published: July 1, 2020, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading