Home /News /movies /

SEKHAR KAMMULA NAGA CHAITANYA AND SAI PALLAVI LOVE STORY GETS GOOD PRICE FOR SATELLITE AND OVERSEAS RIGHTS SR

శేఖర్ కమ్ముల లవ్ స్టోరికి భలే డిమాండ్..శాటిలైట్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో..

నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి Photo : Twitter

నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి Photo : Twitter

శేఖర్ కమ్ముల.. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

    'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో కూడా మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఈయన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Love Story Movie, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు