SEKHAR KAMMULA LOVE STORY MOVIE 1ST WEEKEND COLLECTIONS AND NAGA CHAITANYA SAI PALLAVI MAGIC WORKS AT BOX OFFICE PK
Love Story 1st Weekend Collections: ‘లవ్ స్టోరి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర చైతూ, సాయి పల్లవి మ్యాజిక్..
Love Story Collections Photo : Twitter
Love Story 1st Weekend Collections: హాలు నిండినది అనే బోర్డు చూసి కూడా చాలా నెలలు అయిపోతున్న తరుణంలో లవ్ స్టోరీ సినిమా (Love Story 1st Weekend Collections) మళ్లీ పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.
తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఓ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. హాలు నిండినది అనే బోర్డు చూసి కూడా చాలా నెలలు అయిపోతున్న తరుణంలో లవ్ స్టోరీ సినిమా మళ్లీ పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైతూ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు. శేఖర్ కమ్ముల ఇమేజ్.. సాయి పల్లవి మ్యాజిక్ కలిపి లవ్ స్టోరి సినిమాకు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. తొలి మూడు రోజులు అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా లవ్ స్టోరి ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. 23 కోట్ల వరకు షేర్ వసూలు చేయడంతో.. మరో 9 కోట్ల దూరంలో నిలిచింది ఈ చిత్రం. 32 కోట్ల బిజినెస్ చేసిన లవ్ స్టోరి.. హిట్ అనిపించుకోవాలంటే 33 కోట్లు షేర్ తీసుకురావాలి.
వీకెండ్ వరకు అదిరిపోయే వసూళ్ళు తీసుకొచ్చిన ఈ చిత్రానికి వీక్ డేస్లో అసలు పరీక్ష మొదలు కానుంది. సోమవారం నుంచి కూడా మంచి కలెక్షన్స్ తీసుకొస్తే లవ్ స్టోరీ నిలబడినట్లే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా వసూళ్లు బాగానే తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్రిపబ్లిక్ సినిమా వచ్చేవరకు మరో సినిమా ఏదీ లేకపోవడంతో కచ్చితంగా లవ్ స్టోరి అన్ని ఏరియాల్లో మంచి వసూళ్ళు తీసుకొచ్చేలా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.