SEETIMAARR MOVIE 1ST WW COLLECTIONS AND GOPICHAND RULES THE BOX OFFICE WITH COMMERCIAL MASS CINEMA PK
Seetimaarr 1st day collections: గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్.. కూత అదిరింది..!
Seetimaarr Photo : Twitter
Seetimaarr 1st day collections: గోపీచంద్, తమన్నా (Gopichand Tamannaah) జంటగా సంపత్ నంది (Sampath Nandi) తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సీటీమార్ (Seetimaarr 1st day collections). ఓవర్సీస్ రిలీజ్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 3.16 కోట్ల షేర్ వచ్చింది.
Seetimaarr 1st day collections: గోపీచంద్, తమన్నా (Gopichand Tamannaah) జంటగా సంపత్ నంది (Sampath Nandi) తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సీటీమార్ (Seetimaarr 1st day collections). భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తుంది. గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాల్లో సీటీమార్ కూడా నిలిచింది. తొలిరోజు ఈ చిత్రానికి అన్ని చోట్ల బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీలో కేవలం మూడు షోలతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఓవర్సీస్ రిలీజ్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 3.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రానటువంటి భారీ వసూళ్లు ఇవి. బాలీవుడ్ సినిమాలకు కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. స్పోర్ట్స్ డ్రామాకు సోషల్ ఇష్యూను ముడిపెడుతూ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి సీటీమార్ ఏరియా వైజ్ వసూళ్లు ఓ సారి చూద్దాం..
ఈ సినిమాకు 11.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్లో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ సినిమాను విడుదల చేయలేదు నిర్మాతలు. కేవలం ఇండియాలోనే తమ సినిమాను భారీగానే విడుదల చేసారు. దీనికి స్పందన కూడా బాగానే వస్తుంది. కథ రొటీన్‌గానే ఉన్నా.. సంపత్ నంది స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. దానికితోడు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోయాయి. అందుకే సీటీమార్ థియేటర్స్ విజిల్స్ వేయిస్తుంది. మరో 8 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది. సినిమాకు వచ్చిన టాక్ చూస్తుంటే కచ్చితంగా వీకెండ్ కలెక్షన్స్ కుమ్మేసేలా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.