రూ.1500 కోట్ల భారీ అల్లు రామాయణంలో సీతా రాములుగా వీరే...

Photo : Twitter

Allu Aravind 3D Ramayana : రామాయణం.. ఎన్ని సార్లు విన్న తనవితీరని మహా కావ్యం. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నోసార్లు రామాయ‌ణ గాథను సినిమాగా చూపించారు. మరోసారి భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు త్రీడీలో చూపించడానికి రంగం సిద్దం అవుతోంది.

 • Share this:
  Allu Aravind 3D Ramayana : రామాయణం.. ఎన్ని సార్లు విన్న తనవి తీరని మహా కావ్యం. ఇప్పుడు దీని గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. అయిన ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నోసార్లు రామాయ‌ణ గాథను సినిమాగా చూపించారు.  మరోసారి ఈ కథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా.. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు పార్టులుగా తెలుగు,తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నట్లు  అల్లు అర‌వింద్ ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో శ్రీరాముడి పాత్రలో హిందీ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించనున్నారని సినిమా ప్రకటించిన నాటి నుండి జోరుగా ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ చిత్రంలో నటించేందుకు హృతిక్‌  రోషన్ కూడా ఒప్పుకొన్నారని తాజా  సమాచారం. మరీ రాముడు కుదిరాడు.. సీత పాత్ర. ఈ పాత్ర గురించి కూడా చాలా ప్రచారం జరిగింది. తాజా సమాచారం మేరకు సీతగా నయనతారను కానీ లేదా అనుష్క శెట్టిని  గానీ తీసుకొనే  అవకాశం మెండుగా ఉందని అంటున్నాయి సినీ ఇండస్ట్రీ వర్గాలు.   
  View this post on Instagram
   

  Thank you #Ananthakrishnan 😊


  A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

  ఈ భారీ ప్రాజెక్ట్‌‌ను అత్యంత భారీ సాంకేతికతో  నిర్మించడానికి మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా, అల్లు అరవింద్‌ చేతులు కలిపారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు నిర్మాతలు.


  First published: