సుకుమార్ 'రంగస్థలం' లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. బన్నీకి జోడిగా రష్మిక మందన నటించనుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే సుకుమార్ ఈ సినిమా తర్వాత చేసే సినిమాను ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో చేయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 13 సంవత్సరాల కింద జగడం వచ్చిన సంగతి తెలిసిందే. గూండాయిజం, గొడవలు నేపథ్యంలో వచ్చిన ఆ మూవీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. ఈ కాంబినేషన్ మళ్ళీ ఓ మూవీ రానుందంటూ ఓ వార్త ప్రచారం లోకి వచ్చింది. రామ్ తో మూవీ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఇప్పటికే సుకుమార్, రామ్ కి స్టోరీ కూడా నేరేట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా పూర్తవ్వగానే రామ్ మూవీ స్టార్ట్ కానుందని సమాచారం. కాగా మరోవైపు ఇస్మార్ట్ శంకర్ లాంటీ బంపర్ హిట్ తర్వాత రామ్ రెడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ తమిళ హిట్ సినిమా తడమ్‌కు రీమేక్ వస్తోన్న ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Pothineni, Sukumar