Home /News /movies /

SECOND STORY ABOUT ASWANI DUTT RAGHAVENDRA RAO CHIRANJEEVI SRIDEVI JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI BY NANI VOICE OVER TA

జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ గురించి నాని చెప్పిన రెండో స్టోరీ..

జగదేవకవీరుడు అతిలోకసుందరి (Twitter/Photo)

జగదేవకవీరుడు అతిలోకసుందరి (Twitter/Photo)

తరాలు మారినా.. ఎవర్ గ్రీన్‌గా నిలిచే బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో ఉండే మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అనే దానిపై నాని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా నాని ఈ సినిమా గురించి రెండో స్టోరీ చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి ...
తరాలు మారినా.. ఎవర్ గ్రీన్‌గా నిలిచే బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో ఉండే మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అనే దానిపై నాని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రేపటితో ఈ సినిమా విడుదలైన 30 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ వింటేజ్ వైజయంతీ పేరుతో ఈ సినిమా ఎలా ప్రారంభం అయిందనే విషయాలను మూడు స్టోరీలుగా నాని వాయిస్ ఓవర్‌తో విడుదల చేస్తోంది. ఇప్పటికే ఒకటి విడుదల కాగా.. తాజాగా రెండో స్టోరీని విడుదల చేసారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించిన విన్సెంట్ గారు, అందమైన సెట్స్‌తో మైమరిపించిన చలంగారు, ఎడిటింగ్‌తో ఈ సినిమా టెంపోను ఇచ్చిన చంటి గారు, ఇక ఈ సినిమాకు వేటూరి సుందరామ్మూర్తి ఇచ్చిన పాటలు గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసిన పాటలకు ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ ఈ సినిమాను మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మరోవైపు జంధ్యాల గారు   కథ, కథనం, మాటలు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి.

ముఖ్యంగా ఇళయరాజా ఇచ్చిన అబ్బనీ తియ్యనీ దెబ్బ అనే క్లాస్ ట్యూన్‌ను తన పాటతో మాస్ అప్పీల్ ఇచ్చిన ఘనత వేటూరి గారిది. చిరంజీవికి స్టార్‌డమ్ వచ్చాకా.. ఆయనతో శ్రీదేవి నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. అంతకు ముందు శ్రీదేవి.. చిరుతో  మోసగాడు, రాణికాసుల రంగమ్మ వంటి చిత్రాల్లో నటించినా.. అప్పటికీ చిరంజీవికి స్టార్ డమ్ అనేది లేదు. ఇక ఈ సినిమా దినక్కుతా పాటను విజయా వాహినీ స్టూడియోలో భారీ  సెట్ వేశారు. ఆ పాట షూటింగ్ పూర్తి చేసుకొని శ్రీదేవి మరో షూటింగ్ కోసం ముంబై వెళ్లిపోవాలి.

 అయితే ఆ టైమ్‌లో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. షూటింగ్ చేయకపోతే.. శ్రీదేవి డేట్లు దొరకడం కష్టం. నిర్మాత అశ్వనీదత్ పరిస్థితిని అర్ధం చేసుకున్న చిరంజీవి.. అంత జ్వరంలో ఈ పాటను కంప్లీట్ చేయడం విశేషం. అంత హై ఫీవర్ ఉన్న ఎక్కడ తేడా లేకుండా చిరు ఈ పాటను పూర్తి చేసారు. అంటూ వృత్తి పట్ల చిరంజీవికి గల నిబద్ధతకు నిర్మాత అశ్వనీదత్ ఎప్పటికీ మర్చిపోలేరు అంటూ నాని చెప్పుకొచ్చారు.

Chiranjeevi,Sridevi Jagadeka Veerudu Athiloka Sundari behind the story.. here are the details..,Chiranjeevi,sridevi,chiranjeevi sridevi,chiranjeevi sridevi Jagadeka Veerudu Athiloka Sundari,k raghavendra rao,c ashwani dutt,jandhyala,ilayaraja,chiranjevi sye raa narasimha reddy,jagadeka veerudu athiloka sundari,jagadeka veerudu athiloka sundari songs,jagadeka veerudu athiloka sundari full movie,jagadeka veerudu atiloka sundari (award-winning work),jagadeka veerudu athiloka sundari movie,jagadeka veerudu athiloka sundari video songs,jagadeka veerudu athiloka sundari 25 years program,jagadeka veerudu athiloka sundari (film),jagadeka veerudu atiloka sundari,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి శ్రీదేవి,శ్రీదేవి,శ్రీదేవి చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి,జగదేకవీరుడు అతిలోక సుందరి,కే.రాఘవేంద్రరావు,సి.అశ్వనీదత్,ఇళయరాజా,జంధ్యాల,చక్రవర్తి,
జగదేవవీరుడు అతిలోకసుందరి (ఫేస్‌బుక్ ఫోటో)


ఈ సినిమాలో జగదేకవీరుడుగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె అతిలోకసుందరి ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరోకరిని ఊహించుకోలేము. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగుట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూలోకానికి వస్తోంది. ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్‌లో రెడీ చేసి కే.రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Aswani Dutt, Chiranjeevi, Ilaiyaraaja, Jandhyala, K. Raghavendra Rao, Nani, Sridevi, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు