అందుకే ఆ సీన్స్ చేసానంటోన్న హిప్పీ హీరోయిన్ దిగాంగన

కథ డిమాండ్ చేసింది కాబట్టే.. బోల్డ్ సన్నివేశాల్లో నటించానని, అందులో తప్పేమి లేదంటోంది హీరోయిన్ దిగాంగన సూర్య వంశీ.

news18-telugu
Updated: June 8, 2019, 1:24 PM IST
అందుకే ఆ సీన్స్ చేసానంటోన్న హిప్పీ హీరోయిన్ దిగాంగన
హిప్పీ సినిమాలో దిగాంగన సూర్యవంశీ Photo: Twitter.com/DiganganaS
  • Share this:
'RX100’ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే యువత దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కార్తికేయ.. ఇప్పుడు ‘హిప్పీ’ చిత్రంలో దిగాంగన సూర్య వంశీతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటించాడు. ఈ సినిమా విడులకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేశాయి. వీటిలో కార్తికేయ, దిగాంగన సూర్యవంశీ రొమాంటిక్ పోస్టర్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి తగ్గట్టుగానే కార్తికేయ మరోసారి ముద్దుల వర్షం కురిపించాడు. అయితే కథ డిమాండ్ చేసింది కాబట్టే నేను బోల్డ్ సన్నివేశాల్లో నటించానని, అందులో తప్పేమి లేదంటోంది ఈ సినిమా హీరోయిన్ దిగాంగన. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకే పెట్టారు తప్ప కావాలని పెట్టలేదని సమర్థించుకుంటోంది దిగాంగన.

 

దిగాంగన సూర్యవంశీ Photo_ Twitter.com_DiganganaS
దిగాంగన సూర్యవంశీ Photo_ Twitter.com_DiganganaS


హిందీ బిగ్ బాస్‌9లో పార్టిసిపేట్ చేసి సంచలనం సృష్టించిన ఈ భామ.. చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో బోల్డ్ మూవీలో నటించి కుర్రాళ్లకు బాగా దగ్గరైంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించడంలో తప్పులేదని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading