ఉపాసన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా...రేపిస్టుల నుంచి పిల్లలను కాపాడాలంటే ఈ వీడియో చూడండి..

బాలలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి పిల్లలను కాపాడుకోవడంతో పాటు వారిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై ఉపాసన సమగ్రమైన సమాచారం ఇవ్వడం విశేషం.

news18-telugu
Updated: November 29, 2019, 5:35 PM IST
ఉపాసన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా...రేపిస్టుల నుంచి పిల్లలను కాపాడాలంటే ఈ వీడియో చూడండి..
Instagram/upasanakaminenikonidela
  • Share this:
రాంచరణ్ సతీమణి ఉపాసన తన యూట్యూబ్ చానెల్ ద్వారా పిల్లలను కామాంధుల బారిన పడకుండా కాపాడటం ఎలా అనే టాపిక్ పై వీడియో విడుదల చేసింది. ఇందులో బాలలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి పిల్లలను కాపాడుకోవడంతో పాటు వారిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై ఉపాసన సమగ్రమైన సమాచారం ఇవ్వడం విశేషం. అంతేకాదు ఉపాసన ఇఫ్పటికే లక్షమంది సబ్ స్క్రయిబర్లను అందుకొని ఉపాసన అరుదైన ఫీట్ సాధించింది. ఇదిలా ఉంటే ప్రస్తతం దేశంలో మహిళలు,బాలలపై లైంగిక దాడులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉపాసన తీసుకున్న చొరవకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో కూడా సామాజిక అవగాహన ఉన్న ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయాలని ఆమె అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేశారు.

కాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన మనందరికీ మెగా పవర్ స్టార్ సతీమణిగానే పరిచయం, కానీ ఆమె అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ తనదైన గుర్తింపు పొందతున్నారు.

Published by: Krishna Adithya
First published: November 29, 2019, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading