హోమ్ /వార్తలు /సినిమా /

Satyas Film Academy: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు, TRS నాయకులు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు చేతుల మీదుగా మొదలైన ‘సత్య ఫిల్మ్ అకాడమీ’..

Satyas Film Academy: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు, TRS నాయకులు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు చేతుల మీదుగా మొదలైన ‘సత్య ఫిల్మ్ అకాడమీ’..

సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ప్రారంభం (satyas film academy)

సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ప్రారంభం (satyas film academy)

Satyas Film Academy: సినిమాల్లో నటించాలంటే ఒట్టి డైలాగ్స్ బట్టీ పట్టి చెబితే సరిపోదు. దానికి తగ్గ యాక్టింగ్, యాక్టింగ్ తో పాటు డాన్స్, ఫైటింగ్, ఫిట్ నెస్ లలో కూడా శాస్త్రీయ శిక్షణ తప్పనిసరిగా పొందాలి. అందుకే, నటన నేర్చుకోవాలన్న తపన ఉన్న వారు ఒకే చోట అన్నీ శిక్షణ పొందేలా సత్యాస్ ఫిల్మ్ అకాడమీ సరికోత్తగా మనముందుకు వచ్చింది.

ఇంకా చదవండి ...

సినిమాల్లో నటించాలంటే ఒట్టి డైలాగ్స్ బట్టీ పట్టి చెబితే సరిపోదు. దానికి తగ్గ యాక్టింగ్, యాక్టింగ్ తో పాటు డాన్స్, ఫైటింగ్, ఫిట్ నెస్ లలో కూడా శాస్త్రీయ శిక్షణ తప్పనిసరిగా పొందాలి. అందుకే, నటన నేర్చుకోవాలన్న తపన ఉన్న వారు ఒకే చోట అన్నీ శిక్షణ పొందేలా సత్యాస్ ఫిల్మ్ అకాడమీ సరికోత్తగా మనముందుకు వచ్చింది. డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకొని సత్యాస్ డి జోన్ పెట్టి, ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేసిన సత్యామాస్టర్,టేలెంటున్న యువతీ,యువకులకు నటనతో పాటు అన్నీ రంగాలలో శిక్షణ ఇచ్చి వారిని పరిపూర్ణ నటులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో మార్చి 13 ఆదివారం ఉదయం సినీ,రాజకీయ మహారధుల సమక్షంలో అమీర్ పేటలోని సారధి స్థూడియోస్ ఎదురుగా ఉన్న సత్యాస్ డి జోన్ ఆవరణలో సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు, టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు గారు, సినీ స్టార్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, నిర్మాత ప్రసన్నకుమార్, హీరో డాక్టర్ రాజశేఖర్, నటి జీవితా రాజశేఖర్ లు విచ్చేసి, యాక్టిటింగ్ ఇన్స్టిట్యూట్ ఆవశ్యకతను తెలియజేసి సత్యామాస్టర్ కి ఆశీస్సులు అందించారు. ఈ అకాడమీ ఎంతో మందికి శిక్షణ ఇచ్చి సినీరంగానికి మంచి నటులను పరిచయం చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలియజేశారు. సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ , హీరో సంపూర్ణేష్ బాబు, కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, నటులు, దర్శకులు కాశీవిశ్వనాథ్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, స్పందన ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యూల్ రెడ్డి, విబిజి రాజు, హీరో కిరణ్, నటులు, అధ్యాపకులు సత్యం యాబి, డాక్టర్ ఎంఎస్ చౌదరి, డైరెక్టర్స్ రాజా వంశీ, సుబ్బు, నాగ్ పొలిమేర, మ్యూజిక్ డైరెక్టర్స్ ఖుద్దూస్, భగవత్, బాలాజీ, చిందేపల్లె గిరిధర్ రెడ్డి, సినీ రైటర్ జలదంకి సుధాకర్ గార్లు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని సత్యా మాస్టర్ ని అభినందించారు .

Samantha: ఇప్పటికైనా అమ్మాయిలను అలా చూడటం ఆపేయండి.. వాళ్ళపై సమంత ఫైర్..


అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ మాట్లాడుతూ, ప్రారంభోత్సవానికి వచ్చి బ్లెస్సింగ్స్ అందించిన పెద్దలకు,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. భీమవరం లో పుట్టి అక్కడే విద్యాబ్యాసం చేస్తూ కాలేజ్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేసే వాడినని, చెన్నైలో సినిమా పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే తన సోదరుడు సపోర్ట్ ఇవ్వడంతో గొప్ప డ్యాన్సర్ అవ్వాలనే కోరికతో విజయవాడలో మస్తాన్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ నేర్చుకుని, 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు రావడం జరిగిందని, ముక్కు రాజు మాస్టర్, రాకేష్ మాస్టర్ ల దగ్గర శిష్యరికం అనంతరం డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా చేస్తూ ఎన్నో ఒడిదొడుకులను, కష్టనష్టాలకు ఎదుర్కొన్నానని, ఇండస్ట్రీలో వర్క్ చేసే టైంలో తినడానికి తిండి కూడా దొరికేది కాదని, అయినా ఎంతో కష్టపడి ఈ రంగంలో నిలదొక్కుకోవడం జరిగిందని చెప్పాడు.

Sudigali Sudheer - Rashmi Gautam: ఈటీవీకి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుడ్ బై.. మల్లెమాలకు భారీ షాక్..?


తను కష్టపడి ఈ స్థాయికి రావడానికి తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ వారు, చాలా మంది మాస్టార్లు సపోర్టు చేస్తూ ముందుకు నడిపించారని, అప్పట్లో ఎంతోమంది యువతకు టాలెంట్ చూపించుకునే ఆస్కారం ఉన్నా సరైన శిక్షణ లేక అవకాశం దొరికేది కాదని అది గమనించి వారికి సపోర్ట్ ఇవ్వాలని "సత్య డి.జోన్" డ్యాన్స్ అకాడమీ ని ఏర్పాటు చేయడం జరిగిందని, వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పంపించినందుకు చాలా గర్వపడుతున్నానని అన్నారు

YS Jagan - Tollywood: మోహన్ బాబు చెప్పాడని చేస్తున్నారా.. వైఎస్ జగన్‌కు సినీ ప్రముఖుల సన్మానం..?


యాక్టింగ్ నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్లు ఎందరో తనకు తారసపడ్డారని, వారికి నటనలో సరైన ప్లాట్ఫామ్స్ లేనందున నటనతో పాటు డ్యాన్స్, ఫిట్నెస్, ఫైట్స్ అన్నీ అల్ ఇన్ వన్ లా ఒకే ఇన్స్టిట్యూట్ లో, తగిన బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా తన సత్య డి.జోన్స్ కు ఎక్స్టెన్షన్ గా సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ని ప్రారంభించడం జరిగిందని, ఈ అకాడమీలో ఎంతో నిష్ణాతులైన నంది అవార్డ్ గ్రహీతలైన ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ ద్వారా స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, తన అకాడమీలో చేరే ప్రతి ఒక్కరికీ సినిమాలలో మంచి అవకాశాలు వచ్చేలా నటనలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సత్యాస్ ఫిల్మ్ అకాడమీ లో యాక్టింగ్ లో శిక్షణ కోసం సునయన, రామ్మోహన్ లు , డాన్స్ లో శిక్షణ కోసం తను, తన శిష్యులు వుంటారని, అలాగే యోగాచార్య హరి సుబ్రహ్మణ్యంచే యోగా, సురేష్ పవార్ చే జుంబా, సునీల్ చే జిమ్నాస్టిక్స్ వంటివి కూడా నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు