హోమ్ /వార్తలు /సినిమా /

విడుదలకు సిద్ధంగా ఉన్న సత్యం వధ ధర్మం చెర..

విడుదలకు సిద్ధంగా ఉన్న సత్యం వధ ధర్మం చెర..

Satyam Vadha Dharmam chera (Photo Twitter)

Satyam Vadha Dharmam chera (Photo Twitter)

వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్న చిత్రం "సత్యం వధ ధర్మం చెర". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్న చిత్రం "సత్యం వధ ధర్మం చెర" (Satyam Vadha Dharmam Chera). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ "కథలు చిన్న పిల్లలకి నిద్రపుచ్చడానికి చెప్తు ఉంటాం, కానీ పెద్దమనుషులను మేలుకొలపటానికి కూడా కొన్ని కథలు చెప్పాలి. "సత్యం వధ ధర్మం చెర" చిత్ర కథ మన నిజజీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే అని చెప్పారు.

మనం ప్రతి రోజు ఇలాంటి వార్తలు పేపర్ లో చదువుతూ ఉంటాం లేదా న్యూస్ చానెల్స్ లో చూస్తూ ఉంటాం. మన రాజ్యాగం చాలా గొప్పది, మన చట్టం చాలా గట్టిది, కానీ బాధితుడు చిన్నవాడు కారకుడు పెద్దవాడు అయితే ఈ చట్టం రకరకాలుగా పని చేస్తుంది. మరి నిజంగా చట్టం ఎలా పనిచేయాలో మా చిత్రంలో చుపించాము. సమాజంలో జరిగిన కొని నిజ సంఘటనల ఆధారంగా మా చిత్ర కథని తయారు చేసుకున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 31న విడుదల కానుంది" అని తెలిపారు బాబు నిమ్మగడ్డ.

హీరోయిన్ పూజ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అందరు మా "సత్యం వధ ధర్మం చెర" చిత్రాన్ని ఆదరిస్తారు" అని కోరుకున్నారు.

మరో నటి మధుబాల మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. నాది చాలా కీలక పాత్ర. బాలకృష్ణ గారి సినిమా డైలాగు తో ఒక పాట ఉంటుంది. ఆ పాట లో నేను నటించాను. ఆ పాట బాలకృష్ణ ఫాన్స్ కి పండగల ఉంటుంది. మా సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది " అని తెలిపారు. ఈ సినిమాలో స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా, రాధికా చౌదరి, అర్జు, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనంతలక్ష్మి, నాని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor