Home /News /movies /

SATYAJIT RAY DEATH ANNIVERSARY DO YOU KNOW FACTS ABOUT LEGENDARY DIRECTOR BHARAT RATNA SATYAJIT RAY TA

Satyajit Ray Death Anniversary: స్మృతిలో భారతీయ దిగ్దర్శకుడు భారతరత్న సత్యజిత్ రే...

భారత రత్న ‘సత్యజిత్ రే’ (Twitter/Photo)

భారత రత్న ‘సత్యజిత్ రే’ (Twitter/Photo)

Satyajit Ray Death Anniversary | బెంగాలీ సినిమా, సినిమా ఆఫ్ ఇండియా, సమాంతర చిత్రాల పేరెత్తితే చాలు.. ఆయనే గుర్తుకు వస్తాడు. భారతీయ జీవితంలోని అణువణువుకూ చిత్రణ పట్టిందాయన దర్శక ప్రతిభ. ఆయనే సత్యజిత్ రే. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన అరుదైన దర్శకుడు సత్యజిత్ రే.

ఇంకా చదవండి ...
Satyajit Ray Death Anniversary: బెంగాలీ సినిమా, సినిమా ఆఫ్ ఇండియా, సమాంతర చిత్రాల పేరెత్తితే చాలు.. ఆయనే గుర్తుకు వస్తాడు. అసలు ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రలిప్పటికీ నిజ జీవన చిత్రాలకు ప్రతిబింబాలై నిలుస్తాయి. భారతీయ జీవితంలోని అణువణువుకూ చిత్రణ పట్టిందాయన దర్శక ప్రతిభ. ఆయనే (Satyajit Ray) సత్యజిత్ రే . తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన అరుదైన దర్శకుడు సత్యజిత్ రే. ఆయన సినిమా చూడకపోవడం ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో బతుకుతూ కూడా సూర్యచంద్రులను చూడకపోవడంతో సమానం అవుతుంది’ అంటాడు ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా. ‘పథేర్ పాంచాలీ’ చిత్రంలోని దుర్గ పాత్ర చనిపోయినప్పుడు నేనెందుకు ఏడవాలీ? అని ఎంత కఠినంగా వున్నా.. కళ్లు వాటంతటవి కన్నీళ్లు కార్చకుండా వుండవు.

అపరాజితోలోనూ అంతే. ‘అపూర్ సంసార్’ గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో అపర్ణ చనిపోయినప్పుడు అపూ పడే బాధ వర్ణనాతీతం. కొడుకు దగ్గరకెళ్లమని స్నేహితుడు చెబితే.. ‘‘ఎవరికోసం వెళ్లాలి? వాడు పుట్టడంవల్లే కదా నా భార్య చనిపోయిందని’’ అంటాడు అపూ. ఆ దృశ్యం చూసి ద్రవించని హృదయం వుండదు. ఇక క్లైమాక్స్ సీన్ ఇప్పటికీ సజీవమే.

Legendary director bharat ratna Satyajit Ray unknown facts,Satyajit Ray,Satyajit Ray films,Satyajit Ray movies,Satyajit Ray director,Satyajit Ray covid 19,bollywood,tollywood,సత్యజిత్ రే,సత్యజిత్ రే. సత్యజిత్ రే సినిమాలు,సత్యజిత్ రే గురించి తెలియని నిజాలు,భారతీయ దిగ్దర్శకుడు
ఒక సినిమా చిత్రీకరణ సమయంలో హీరో,హీరోయిన్లకు సూచనలు ఇస్తున్న సత్యజిత్ రే (File/Photo)

సత్యజిత్ రే.. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ గా ఎన్నో ఎత్తులకు చేర్చిన దిగ్దర్శకుడు. సున్నితమైన ప్రేమానుబంధాలను ఫ్రేముల్లో బంధించడంలో దిట్ట. గూడుకట్టుకున్న విషాదం, నిజ జీవితంలోని వెలుగుజిలుగులు, రాగద్వేషాలకుండే విలువలకు పట్టం కట్టడం.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన సినిమా చూడ్డం మొదలు పెడితే.. అది పూర్తయినా అందులోంచి బయట పడ్డం సాధ్యం కాదు. జీవితాంతం వెంటాడే దృశ్యాలను ఒక చోట ఏర్చీ కూర్చి.. సినిమాగా మలచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తొలినాళ్లలో.. ఇండియన్ సినిమాను శాసించిన అతి కొద్దిమందిలో సత్యజిత్ రే ఒకడు. 1921, మే2న కలకత్తాలో జన్మించాడు. ఆయన కుటుంబం ఓ పెద్ద కళల కాణాచి. సాహితీ నిలయం. తాతయ్య ఉపేంద్ర కిషోర్ రాయ్ సాహితీపరుడు. తండ్రి సుకుమార్ రాయ్ చిల్డ్రన్ లిటరేచర్ కం నాన్సెస్ రైమ్ రైటర్. వీరి ఫ్యామిలీకి ‘యు రే అండ్ సన్స్’ అనే ప్రింటింగ్ ప్రెస్ వుండేది.

Legendary director bharat ratna Satyajit Ray unknown facts,Satyajit Ray,Satyajit Ray films,Satyajit Ray movies,Satyajit Ray director,Satyajit Ray covid 19,bollywood,tollywood,సత్యజిత్ రే,సత్యజిత్ రే. సత్యజిత్ రే సినిమాలు,సత్యజిత్ రే గురించి తెలియని నిజాలు,భారతీయ దిగ్దర్శకుడు
పథేర్ పాంచాలి సినిమాలో సన్నివేశం (Twitter/Photo)

ఫిక్షన్ రైటర్, పబ్లిషర్, ఇల్లస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్, ఫిల్మ్ క్రిటిగ్గా నూ సత్యజిత్ రే సుపరిచుతుడే. Feluda, sleuth, ప్రొఫెసర్ సుంకు.. వంటి పాత్రల సృష్టి చేశాడు. సైన్స్ ఫిక్షన్ రైటర్ గా రే సుప్రసిద్ధుడు. దర్శకుడిగా తొలిచిత్రం ‘పథేర్ పాంచాలి’. రెండు నేషనల్ అవార్డులతో పాటు, పదకొండు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు సొతం చేసుకుంది.  అందులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాధించిన బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంటరీ అవార్డు కూడా ఒకటి. అలా.. నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గానూ  సత్యజిత్ రే సినీ కెరీర్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.

Legendary director bharat ratna Satyajit Ray unknown facts,Satyajit Ray,Satyajit Ray films,Satyajit Ray movies,Satyajit Ray director,Satyajit Ray covid 19,bollywood,tollywood,సత్యజిత్ రే,సత్యజిత్ రే. సత్యజిత్ రే సినిమాలు,సత్యజిత్ రే గురించి తెలియని నిజాలు,భారతీయ దిగ్దర్శకుడు
సత్యజిత్ రే (File/Photo)

ది అపూ ట్రయాలజీలోని అపరాజితో, అపూర్ సంసార్ చిత్రాలకుగానూ scripting, casting, scoring, and editing విభాగాలను ఒంటిచేత్తో నడిపించి ఖ్యాతి గడించాడు సత్యజిత్ రే. ఆయన కెరీన్ మొత్తంలో.. 32 నేషనల్ ఫిల్మ్ అవార్డులు కలుపుకుని ఆయన ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం సాధించాడు. ఆయన పొందిన అవార్డులలో 1992లో వచ్చిన ఆస్కార్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు, 1992లో వచ్చిన భారతరత్న  అవార్డులు అత్యంత ముఖ్యమైనవి.

Legendary director bharat ratna Satyajit Ray unknown facts,Satyajit Ray,Satyajit Ray films,Satyajit Ray movies,Satyajit Ray director,Satyajit Ray covid 19,bollywood,tollywood,సత్యజిత్ రే,సత్యజిత్ రే. సత్యజిత్ రే సినిమాలు,సత్యజిత్ రే గురించి తెలియని నిజాలు,భారతీయ దిగ్దర్శకుడు
సత్యజిత్ రే (File/Photo)

సినిమాను సినిమా కోసం తీసిన దర్శకుడు సత్యజిత్ రే. భారతీయ దర్శక ప్రతిభను ఖండ ఖండాంతరాలకు వ్యాపింపచేసిన అపర మేధావి. అందుకే మరే ఇతర దర్శకులకు సొంతం కాని ఎన్నో అవార్డులూ, రివార్డులూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి.  ఆయనపై భారతీయ దరిద్రాన్ని విదేశాలకు ఎగుమతి చేసి పేరు సాధించాడన్న విమర్శలున్నాయి. కానీ, తన కెరీర్లో ఏనాడూ భావ దారిద్రానికి లోను కాని మహా దర్శకుడు సత్యజిత్ రే. తన 70వ ఏట అంటే, 1992 ఏప్రిల్ 23న రే మరణించినప్పుడు.. కలకత్తా నగరమంతా ఆయన ఇంటిముందు నివాళులర్పించడానికి నిలిచింది. భారతీయ జీవనచిత్రంలోని అణువణువూ తెరకెక్కించిన దర్శకుడిగా సత్యజిత్ రే తర్వాతే ఎవరైనా. ఆ మహనీయుడికి చిత్రాంజలి ఘటిస్తూ సెలవు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bharat Ratna, Bollywood news, Dadasaheb Phalke Award, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు