• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SATYADEV TO ACT WITH AKSHAY KUMAR RAM SETU PROJECT HERE ARE THE DETAILS TA

Satyadev: అక్షయ్ కుమార్ మూవీలో కీలక పాత్ర చేస్తోన్న సత్యదేవ్..

అక్షయ్ కుమార్ సినిమాలో సత్యదేవ్ (Twitter/Photo)

Satyadev: అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ఓ భారీ చారిత్రక చిత్రంలో టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని సత్యదేవ్‌ కన్ఫామ్ చేసారు.

  • Share this:
    Satyadev: అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ఓ భారీ చారిత్రక చిత్రంలో టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని సత్యదేవ్‌ కన్ఫామ్ చేసారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నటులు ముఖ్యంగా అక్కడి హీరోలు ఇక్కడ నటిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ నుంచి చిరంజీవి నుంచి మొదలు పెడితే.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వరకు అందరు బాలీవుడ్‌లో తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. మరోవైపు నాగ చైతన్య కూడా ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ .. ఇపుడు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా ’రామ్ సేతు’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

    సత్యదేవ్‌కు ఇది రెండో హిందీ సినిమా. గతంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’లో ఓ క్యారెక్టర్ చేసారు. ఆ తర్వాత రానా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఘాజీ’లో కీలక పాత్రలో నటించారు. ఇపుడు మరోసారి అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. మొత్తంగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోన్న సత్యదేవ్... ఇపుడు బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

    Satyadev To Act With Akshay Kumar Ram Setu Project Here Are The DetailsSatyadev: అక్షయ్ కుమార్ మూవీలో కీలక పాత్ర చేస్తోన్న సత్యదేవ్..,Satyadev,Satyadev Akshay Kumar,Akshay Kumar Ram Setu Movie,Satyadev Ram Setu Movie,Akshay Kumar,ram Setu,akshay kumar Ram Setu First Look Released,Akshay Kumar Ram Setu Movie,Ram Setu Ayodhya Ram Janmabhoomi,Ram Setu,Ram Setu bollywood Project,Ram Setu Bollywood Movie,Askhay Kumar Ram Setu Movie,Akshay Kumar Twitter,Akshay Kumar Instagram,Ram Setu,bollywood,Hindi cinema,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ రామ్ సేతు ప్రాజెక్ట్,అక్షయ్ కుమార్ రామ్ సేతు మూవీ,రామ్ సేతు మూవీ,బాలీవుడ్ రామ్ సేతు మూవీ,రామ్ సేతు,రామ్ సేతు,అయోధ్య రామ జన్మభూమిలో ప్రారంభమైన అక్షయ్ కుమార్ రామ్ సేతు మూవీ,రామ్ సేతు మూవీ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల,అక్షయ్ కుమార్ సత్యదేవ్,సత్యదేవ్ మూవీలో అక్షయ్ కుమార్
    అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లో సత్యదేవ్ (Twitter/Photo)


    ‘రామ్ సేతు’ విషయానికొస్తే..  అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ పై  తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ విషయమై ఈ సినిమాలో ఏమి చూపించనున్నారో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: