Thimmarusu Twitter Review : సత్యదేవ్ తిమ్మరుసు ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Thimmarusu Photo : Twitter

Thimmarusu Twitter Review : యువ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు.

  • Share this:
    యువ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. తన నటన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు వెబ్ సిరీస్‌లను చేస్తూనే ఆయన హీరోగా చేసిన తాజా సినిమా తిమ్మరుసు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా మొదట ఓటీటీలో విడుదలవుతుందని అనుకున్నారు. ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద సినిమాలే ఓటీటీ బాట పడుతుంటే ధైర్యంగా ఈ సినిమా ఈరోజు థియేటర్‌లో విడుదలవుతోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు తిమ్మరుసు సినిమాను నిర్మించారు. ఈ సినిమాను కిరాక్ పార్టీ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు. కథ విషయానికి వస్తే.. 8 ఏళ్ళ కింద జరిగిన ఓ మర్డర్ మిస్టరీని హీరో ఎలా చేధించారు. అందులో భాగంగా ఆయన ఎదుర్కోన్న సవాళ్లు ఏంటీ అనేది ముఖ్యంగా వస్తోంది. బ్రహ్మాజీ, రవిబాబు ముఖ్య పాత్రలో నటించగా.. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించింది.
    కరోనా నేపథ్యంలో థియేటర్‌లో విడుదలవుతోన్న తిమ్మరుసు ఎలా ఉంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు. సత్యదేవ్ నటన ఎలా ఉంది.. కథ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇంకా ఇతర అంశాలను.. సినిమాను ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..





    ట్విట్టర్ రివ్యూస్‌ను బట్టి చూస్తే.. సినిమా హిట్ అని తెలుస్తోంది. ఇక సత్య దేవ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. తిమ్మరుసు సినిమా (Thimmarusu movie) విడుదల తర్వాత లాక్డ్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు గాడ్సే, స్కైలాబ్, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాల్లో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా ఫేమస్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా నిర్మించనున్న మరో సినిమాలోనూ సత్యదేవ్ హీరోగా నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: