Thimmarusu 1st day Collections: ‘తిమ్మరుసు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత.. సత్యదేవ్ మ్యాజిక్ చేసాడా..?

సత్యదేవ్ తిమ్మరుసు (Satyadev Thimmarusu)

Thimmarusu 1st day Collections: నాలుగు నెలల గ్యాప్ తర్వాత థియేటర్ప్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. ఈ శుక్రవారం సత్యదేవ్(Satyadev) నటించిన తిమ్మరుసు(Thimmarusu 1st day Collections)తో పాటు తేజ సజ్జ ఇష్క్ సినిమాలు విడుదలయ్యాయి.

  • Share this:
నాలుగు నెలల గ్యాప్ తర్వాత థియేటర్ప్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అందులో సత్యదేవ్ నటించిన తిమ్మరుసుతో పాటు తేజ సజ్జ ఇష్క్ సినిమాలు ఉన్నాయి. అందులో ఇష్క్ సినిమాకు టాక్ నెగిటివ్‌గానే వచ్చింది. దాంతో తేజ సినిమా రేసు నుంచి తప్పుకుంది. మిగిలిన మూడు సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఈ వారం విడుదలైన సినిమాల్లో సత్యదేవ్ తిమ్మరుసు మాత్రమే కాస్త మంచి టాక్ తెచ్చుకుంది. ఎప్పట్లాగే మరోసారి తన నటనతో సినిమాను నిలబెట్టాడు సత్యదేవ్. కథ రొటీన్‌గానే ఉన్నా కూడా మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించాడు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. దాంతో తిమ్మరుసుకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా భారీ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాలు కావడంతో కలెక్షన్స్ ఎలా వస్తున్నాయనే విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ కేసులు బాగానే వస్తున్నాయి. అయినా కూడా అన్ని నిబంధనల మధ్య థియేటర్స్ ఓపెన్ చేసారు. ఇలాంటి సమయంలో వచ్చిన తిమ్మరుసుకు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజే 54 లక్షల షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయమేం కాదు.
satyadev,Thimmarusu 1st day Collections,satyadev Thimmarusu 1st day Collections,satyadev movies,satyadev twitter,Thimmarusu 1st day worldwide Collections,telugu cinema,సత్యదేవ్,సత్యదేవ్ తిమ్మరుసు ఫస్ట్ డే కలెక్షన్స్,సత్యదేవ్ తిమ్మరుసు కలెక్షన్స్
సత్యదేవ్ తిమ్మరుసు (Satyadev Thimmarusu)

వీకెండ్ నాటికి కచ్చితంగా సినిమా 2 కోట్ల వరకు షేర్ వసూలు చేస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. అదే జరిగితే సినిమా సేఫ్ అయినట్లే. 3 కోట్ల లక్ష్యంతో తిమ్మరుసు బరిలోకి దిగాడు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా పోటీ లేకపోవడంతో తిమ్మరుసుకు వీకెండ్ కలెక్షన్స్ బానే వచ్చేలా కనిపిస్తున్నాయి. సత్యదేవ్‌పై ఉన్న నమ్మకంతో థియేటర్స్ వరకు ప్రేక్షకులు అయితే వస్తున్నారు. మరి రాబోయే సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: