హోమ్ /వార్తలు /సినిమా /

Tamannaah: గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. పిచ్చెక్కిస్తున్న సత్యదేవ్ రొమాంటిక్ యాంగిల్స్

Tamannaah: గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. పిచ్చెక్కిస్తున్న సత్యదేవ్ రొమాంటిక్ యాంగిల్స్

Gurthunda seetakalam Trailer

Gurthunda seetakalam Trailer

Gurtunda Seetakalam Trailer: యాక్టర్ సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurtunda Seetakalam). నాగ శేఖర్ (Naga Shekar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉండే కథ, కథనంతో రూపొందింది. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా ఈ గుర్తుందా శీతాకాలం సినిమాను నిర్మించారు.

ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఈ మూవీని విడుదల చేస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

2 నిమిషాల 23 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో సత్యదేవ్ ‘దేవ్’ అనే పాత్రలో కనిపించగా.. ముగ్గురు అమ్మాయిలతో ఆయన నడిపించిన లవ్ ట్రాక్ హైలైట్ అయింది. లైఫ్‌లో ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అమ్మాయితో లవ్, ఎఫెక్షన్, కన్ఫ్యూజన్, బ్రేకప్‌.. ఇలా సత్యదేవ్ జీవితంలో జరిగిన సీన్స్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. ప్రేమించడమంటే మనకు ఇష్టమైన వాళ్లకోసం ఇష్టమైనది చేయడమే కదా! అనే డైలాగ్ యూత్ ఆడియన్స్‌‌కి కనెక్ట్ అవుతోంది.

తమన్నాతో సత్యదేవ్ మాట్లాడుతూ గతంలో రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్ చెప్పే సీన్.. ఏదో కొద్ది కొద్దిగా టిఫిన్స్ చేశా అంతే అని చెప్పే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. మొత్తానికి యూత్ మెచ్చే రొమాంటిక్ యాంగిల్ లో ఈ సినిమాలో ఏదో వైవిధ్యం చూపించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.' isDesktop="true" id="1527660" youtubeid="otLsLhvcjSw" category="movies">

క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ఈ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. గతంలో రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, వీడియోలు సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పగా.. తాజాగా వదిలిన ట్రైలర్ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన ఈ సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

First published:

Tags: Satyadev, Tamannaah, Tollywood

ఉత్తమ కథలు