హోమ్ /వార్తలు /సినిమా /

Skylab movie review: ‘స్కైలాబ్’ సినిమా రివ్యూ.. కథ ఓకే కానీ కథనమే వీక్..

Skylab movie review: ‘స్కైలాబ్’ సినిమా రివ్యూ.. కథ ఓకే కానీ కథనమే వీక్..

స్కైలాబ్ రివ్యూ (skylab movie review)

స్కైలాబ్ రివ్యూ (skylab movie review)

Skylab movie review: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల వైపు అడుగులు వేసే హీరో సత్యదేవ్ (Satyadev). ఈయన్ని హీరో అనేకంటే కూడా నటుడు అనాలేమో..? ఎందుకంటే భిన్నంగా ఉండే కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడు ఈయన నిత్య మీనన్‌ (Nitya Menon)తో కలిసి చేసిన ప్రయత్నం స్కైలాబ్ (Skylab movie review). 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొత్త దర్శకుడు విశ్వక్. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

ఇంకా చదవండి ...

నటీనటులు: సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్‌ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు

సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల

నిర్మాణ సంస్థ: బైట్‌ ప్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ

నిర్మాతలు: పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్‌

దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల వైపు అడుగులు వేసే హీరో సత్యదేవ్ (Satyadev). ఈయన్ని హీరో అనేకంటే కూడా నటుడు అనాలేమో..? ఎందుకంటే భిన్నంగా ఉండే కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడు ఈయన నిత్య మీనన్‌ (Nitya Menon)తో కలిసి చేసిన ప్రయత్నం స్కైలాబ్ (Skylab movie review). 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొత్త దర్శకుడు విశ్వక్. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

ఈ సినిమా కథ అంతా 1979 ప్రాంతంలోనే కరీంనగర్‌ జిల్లా బండలింగంపల్లి గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరి దొర కూతురు గౌరి (నిత్యా మీనన్‌) ఓ జర్నలిస్ట్. మంచి వార్తలు రాసి తండ్రి పేరుతో కాకుండా సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది. మరోవైపు అదే ఊరు నుంచి హైదరాబాద్ వెళ్లి డాక్టర్ అయి.. చిన్న సమస్యలో ఇరుక్కుని మళ్లీ అదే ఊరికి వస్తాడు ఆనంద్ (సత్యదేవ్). సొంతూరికి వచ్చి క్లినిక్‌ పెట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయనకు అదే గ్రామవాసి అయిన సుబేదార్‌ రామారావు (రాహుల్‌ రామకృష్ణ) సాయంతో క్లినిక్ పెట్టుకుంటాడు. ఆయన కూడా ఊరి నిండా అప్పులతో ఉంటాడు. ఆస్తులు కోర్టులో ఉండటంతో.. కేసు గెలిచి తాత భూములు అమ్మి అప్పులు తీర్చాలనుకుంటాడు. అదే సమయంలో ఆనంద్‌‌తో కలిసి క్లినిక్ పెడతాడు. సరిగ్గా తమ జీవితంలో ఎదుగుతున్న సమయంలో అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని.. భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. వాటిని నమ్మి జనం భయపడుతుంటారు. ఆ సమయంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. స్కైలాబ్‌ నిజంగానే పడిందా అనేది అసలు కథ..

కథనం:

స్కైలాబ్ పడుతుందంట.. మనుషులందరూ చచ్చిపోతారు అంట.. చాలా మంది చిన్నప్పుడు వాళ్ళ వాళ్ల ఇంట్లో పెద్ద వాళ్ల నుంచి విన్న కథ ఇది. ఆ సమయంలో జరిగిన అల్లర్లు, హంగామా, భయాల గురించి కొన్ని విషయాలు వినుంటారు. ఆ నేపథ్యంలో సినిమా అనేసరికి ఏదో తెలియని ఆసక్తి అందరిలోనూ బాగా ఏర్పడింది. ఒక కొత్త విషయం చెప్పాలన్న దర్శకుడు విశ్వక్ ప్రయత్నం మంచిదే. కానీ ఆ విషయం ఎలా చెబుతున్నాం అనేది కూడా కీలకం. తీసుకున్న కథ కొత్తగానే ఉన్నా.. తీసిన విధానం మాత్రం చాలా నీరసంగా అనిపించింది. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిన దర్శకుడు.. ఉన్నట్టుండి దాన్ని కట్ చేసి.. ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథ జోలికి పోలేదు. సెకండాఫ్ కూడా చాలా నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వచ్చింది. స్కైలాబ్ విషయం జరిగినప్పుడు.. అప్పటి జనాల్లో ఉన్న అమాయకత్వాన్ని తెరపై వినోదాత్మకంగా చూపించాడు విశ్వక్. ఈ క్రమంలోనే నవ్వు తెప్పించే సన్నివేశాలు సినిమాలో అక్కడక్కడా బాగానే ఉన్నాయి. ప్రజల్లో ప్రాణభయం.. అన్ని వివక్షలను తీసి పక్కన పెడుతుంది. సినిమాలో అది కూడా కీలకమైన విషయమే. చచ్చిపోతామని తెలిసిన తర్వాత అంతా ఒక్కటైపోతారు. కథలో ఏ పార్ట్ ఇంకా ఎమోషనల్ గా చూపించి ఉంటే బాగుండేది. కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి.. అసలు విషయం పక్కదారి పట్టిందేమో అనిపించింది. స్కైలాబ్ అనే ఒక కొత్త విషయం తప్ప.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కొత్తగా అనిపించలేదు.

నటీనటులు:

సత్యదేవ్ మరోసారి ఆకట్టుకొన్నాడు.. ఆయన సహజ నటుడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా ఇట్టే అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు సత్యదేవ్. నిత్యా మీనన్ కూడా బాగా చేసింది.. ఈ సినిమాకు ఆమె సహ నిర్మాత కూడా. దాంతో మరింత దృష్టి ఎక్కువ పెట్టినట్లు అనిపించింది. రాహుల్ రామకృష్ణ, టాక్సీవాలా ఫేమ్ విష్ణు పాత్రలు బాగున్నాయి. తులసి నటన కూడా బాగుంది. పంచులు కూడా బాగానే వేసారు ఈమె. నారాయణరావు, సుబ్బరాయశర్మ లాంటి సీనియర్ నటులు పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం కొత్తగా వింతగా అనిపించింది. ముఖ్యంగా టైప్ శబ్ధం కొత్తగా అనిపించింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వీక్. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా నెమ్మదించే సన్నివేశాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా రిచ్‌గా కనిపించింది. దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది కానీ తీసిన విధానం మాత్రం రొటీన్ అయిపోయింది. ఈ కథను ఇంకా ఎమోషనల్‌గానూ చెప్పే ప్రయత్నం చేయొచ్చేమో అనిపించింది. స్కైలాబ్ సమయంలో చాలా మంది బంగారం మింగేయడం.. పార్టీలు చేసుకోవడం.. ఫుల్లుగా తాగేసి పడిపోవడం ఇలా ఎన్నో చేసారని చెప్తుంటారు పెద్దలు. అలాంటి సీన్స్ కాకపోయినా కనీసం కొన్ని ఎమోషనల్ సీన్స్ అయినా పడుంటే బాగుండేది. అంతా పైపైనే కథను టచ్ చేసి వదిలేసినట్లు అనిపించింది.

చివరగా ఒక్కమాట:

ఓవరాల్‌గా.. స్కైలాబ్ మంచి కథ.. కానీ కథనం అంతంతమాత్రం..

రేటింగ్: 2.5/5

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Movie reviews, Nitya Menen, Satyadev, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు