హోమ్ /వార్తలు /సినిమా /

Suriya : తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు యువ హీరో సత్య దేవ్ సాయం..

Suriya : తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు యువ హీరో సత్య దేవ్ సాయం..

సూర్య, సత్య దేవ్ Photo : Twitter

సూర్య, సత్య దేవ్ Photo : Twitter

Suriya : ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంగా ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హ‌ద్దురా... సూర్య న‌టిస్తూ, నిర్మించాడు.

  బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపిస్తోంది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  కాగా కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా సూర్య ఈ ప్రకటన చేశాడు. ఆకాశం నీ హద్దురా అక్టోబర్ 30 వ తారీఖున స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది.

  ఓటీటీలో విడుదల చేయాలని హీరో సూర్య తీసుకున్న నిర్ణయంపై తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే సూర్య తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ తమిళ దర్శకనిర్మాత భారతీరాజా మద్దతుగా నిలిచాడు. సూర్య గురించి కామెంట్ చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.  అంతేకాదు సూర్య తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌ముఖ చ‌ల‌న‌చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ కూడా స‌మ‌ర్ధించాడు. ఆరు నెల‌లుగా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా జ‌న జీవ‌నం స్తంభించిపోయి ఉందనీ, అందుకు అనుగుణంగా థియేట‌ర్లను కూడా మూసివేశారనీ, ఇప్పుడు అవి తెరుచుకున్నా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించి క‌రోనాకు బ‌లి చేయ‌డం స‌రైన ప‌ని కాదనీ ఆయ‌న తన లేఖలో అభిప్రాయ‌ప‌డ్డాడు. అందుక‌ని ఓటీటీలో నేరుగా 'ఆకాశం నీ హ‌ద్దురా' (సూరారై పొట్రు) చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని సంక‌ల్పించిన సూర్య‌ అభినందిస్తున్నాను అని పేర్కోన్నాడు.

  ఇక ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రస్తుతం డబ్బింగ్ పనులు మొదలైయాయి. అయితే ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడని టాక్. తెలుగు వెర్షన్‌లో సత్యదేవ్ వాయిస్ సూర్య రోల్ కు ఎంతవరకు సరిపోతుందో అని ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఇక ఈ మధ్యే సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ ఇటీవల ధనుష్‌తో అసురన్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా వస్తోన్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya, Tollywood news

  ఉత్తమ కథలు