హోమ్ /వార్తలు /సినిమా /

సూర్యకు డబ్బింగ్ చెబుతోన్న ఇస్మార్ట్ హీరో.. కొత్త అవతారంలో యువ హీరో..

సూర్యకు డబ్బింగ్ చెబుతోన్న ఇస్మార్ట్ హీరో.. కొత్త అవతారంలో యువ హీరో..

2. సూరరయ్ పోట్రు: సూర్య

2. సూరరయ్ పోట్రు: సూర్య

Soorarai Pottru : తమిళ హీరో సూర్య, సుధా కొంగర ప్రసాద్ కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

  Soorarai Pottru : తమిళ హీరో సూర్య, సుధా కొంగర ప్రసాద్ కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'సూరారై పోట్రు' అనే పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. సుధా కొంగర గతంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'గురు' సినిమాను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘ఆకాశం నీ హద్దురా’ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే సన్ నెట్‌వర్క్ భారీ ధర చెల్లించి శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. ‘ఆకాశం నీ హద్దురా’ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సూర్య ఆయన తెలుగు సినిమాలకు డబ్బింగ్  చెప్పకపోయినా పాత్రలను, పరిస్థితులను అనుసరించి కొన్ని చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

  అయితే తాజా పరిస్థితుల మధ్య విడుదల కానున్న ఆకాశం నీ హద్దురా చిత్రానికి సూర్య కాకుండా తెలుగు యువ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నాడట. అంతేకాదు సూర్య బాడీ లాంగ్వేజ్ కు కానీ సత్యదేవ్ వాయిస్‌కు సరిగ్గా కుదురుతోందట. సత్య దేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సెకండ్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు జి వి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన విడుదల తేదిని ప్రకటించనుంది చిత్రబృందం.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya, Telugu Cinema News, Tollywood

  ఉత్తమ కథలు