Rajinikanth : రజనీకాంత్ సినిమాలో తెలుగు యువ హీరో.. బంపర్ ఆఫర్ కొట్టాడుగా..

ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

news18-telugu
Updated: August 25, 2020, 11:19 AM IST
Rajinikanth : రజనీకాంత్ సినిమాలో తెలుగు యువ హీరో.. బంపర్ ఆఫర్ కొట్టాడుగా..
రజనీకాంత్ Photo : Twitter
  • Share this:
ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. వారిచేత విజిల్ వేయించగలడు. శివ గతంలో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాల్లో శివ అజిత్‌ను ఓ లేవల్లో చూపిస్తూ అదరగొట్టాడు. కాబట్టి ప్రస్తుతం రజనీతో చేస్తోన్న సినిమాలో శివ.. సూపర్ స్టార్‌ను ఏవిధంగా చూపిస్తాడో.. అని తెగ ఆసక్తితో చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అప్పటి స్టార్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనాలు న‌టిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో కీర్తి సురేష్ కూడా కనిపించనుంది. ఇక ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ఈయన ఇటీవల ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యలో నటించి అదరగొట్టాడు. అయితే గతంలో ఈ పాత్రలోనే హీరో గోపీచంద్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. కాగా అలాంటిదేమి లేదని గోపీచంద్ స్పష్టతనిచ్చాడు. ఈ నేపథ్యంలో సత్య దేవ్.. రజనీ సినిమాలో నటించడం.. ఆయనకు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఇక ఇటీవల రజనీకాంత్ నటించిన పేట, దర్భార్ లాంటీ సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో రజనీకాంత్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి మరి శివ రజనీకాంత్‌కు ఏ రేంజ్‌లో హిట్ ఇస్తాడో..
Published by: Suresh Rachamalla
First published: August 25, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading