SATPAGIRI STARRER GOODUPUTANI MOVIE PREMIERS ON 8TH JULY ZEE 5 OTT TA
Satpagiri - Gooduputani : Zee 5లో ‘గూడుపుఠాని’ చేయడానికి రెడీ అయిన సప్తగిరి..
గూడుపుఠానీ ఓటీటీ (Twitter/Photo)
Satpagiri - Gooduputani తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సప్తగిరి. ఈయన హీరోగా నటించిన ‘గూడుపుఠానీ’ మూవీని జీ5లో స్ట్రీమింగ్కు రానుంది.
Satpagiri - Gooduputani తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సప్తగిరి. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఈయనే కనిపించేవాడు. పైగా మధ్యలో కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు సప్తగిరి. గతేడాది ఈయన హీరోగా నటించిన గూడుపుఠాని. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం గూడుపుఠాణి. ఈ చిత్రం 2021 డిసెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలైంది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ "గూడుపుఠాణి" చిత్రం జీ 5 ఓటీటీలో (శుక్రవారం) 8 జులై నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ "మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి.
IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ 5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నట్టు తెలియజేసారు. మరి కొన్ని గంటల్లో జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను థియేటర్లో మిస్ అయినావాళ్లు ఇప్పుడు జీ 5 లో చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.