లాక్‌డౌన్‌లో వైద్యం కోసం అర్థిస్తున్న ప్రముఖ నటుడు..

Satish Kaul: లాక్‌డౌన్ చాలా మందికి చెప్పుకోలేని కష్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడికి కూడా ఇలాంటి తిప్పలే తెస్తుంది. ఒకటి రెండు కాదు 300 సినిమాలకు పైగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 6:32 PM IST
లాక్‌డౌన్‌లో వైద్యం కోసం అర్థిస్తున్న ప్రముఖ నటుడు..
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)
  • Share this:
లాక్‌డౌన్ చాలా మందికి చెప్పుకోలేని కష్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడికి కూడా ఇలాంటి తిప్పలే తెస్తుంది. ఒకటి రెండు కాదు 300 సినిమాలకు పైగా నటించిన ఓ సీనియర్ నటుడు ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనే మహాభారతం సీరియల్‌లో ఇంద్రుడి పాత్ర పోషించిన సతీష్ కౌల్. ప్రస్తుతం ఈయన చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా మహాభారతం మళ్లీ రావడంతో ఈ తరానికి కూడా పరిచయం అయ్యాడు సతీష్ కౌల్. అయితే ఈయన ప్రస్తుత స్థితి తెలిసిన వాళ్లంతా అయ్యో పాపం అనుకుంటున్నారు.
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)


మొన్నటికి మొన్న ఇదే సీరియల్‌లో హనుమంతుడి పాత్రధారి కూడా కన్నుమూసాడు. ఇప్పుడు సతీష్ కౌల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. లాక్‌డౌన్ కారణంగా చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఈయన. సాయం చేసే చేతుల కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన పంజాబ్‌లోని లుధియానాలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులోనే తన చివరిదశను గడిపేస్తున్నాడు. ఈయన పరిస్థితి తెలుసుకుని కపిల్ శర్మ ఆర్థిక సాయం కూడా చేసాడు.
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)

ప్రస్తుతం సతీష్ కౌల్ కనీసం నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసే స్థితిలో లేడని సన్నిహితులు చెప్తున్నారు. నటుడిగా తనకు ఎంతో ప్రేమ, ఆశీర్వాదాలు లభించాయని గుర్తు చేసుకున్నాడు సతీష్ కౌల్. మహాభారతంతో పాటు సుమారు 300 హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు ఈయన. వాటిలో ప్యార్ తో హోనాహి థా, ఆంటీ నెంబర్ 1, విక్రమ్ బేటల్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో జరిగిన చిన్న సంఘటన వల్ల పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు సతీష్ కౌల్.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading