బాలీవుడ్ చిత్ర సీమలో ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లతో స్టెప్పులు వేయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. సరోజ్ ఖాన్ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ఆమె మరణంపై బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ఐతే.. చనిపోయే ముందు సరోజ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చివరగా సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది.ఆ పోస్ట్‌లో సరోజ్ ఖాన్... సుశాంత్ ఆత్మహత్యపై తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
నేను మీతో ఇప్పటి వరకు పనిచేయలేదు. కానీ నేను మిమ్మల్ని ఎన్నో సార్లు కలసుకున్నాను. ఇక నేను మీ చేసిన సినిమాలన్ని చూసాను. మీ రన్నా.. మీ మూవీస్ అన్న నా కెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. మీ జీవితంలో జరిగిన పొరపాటు ఏమిటి. మీరు మీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం నన్ను ఎంతగానో కలిచివేసిందంటూ చెప్పుకొచ్చింది. నీ కష్టాలను, బాధలను ఎవరైనా పెద్దవాళ్లతో చెప్పుకుంటే కాస్త అయినా మీ బాధ తగ్గేది అంటూ వ్యాఖ్యానించింది. అపుడు మీ ఫ్యామిలీ గురించి నాకు అంతగా తెలియదు. సుశాంత్ నువ్వు బాలీవుడ్‌కు తీవ్ర అన్యాయం చేసి వెళ్లిపోయావు. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. అంతేకాదు వాళ్ల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,. సుశాంత్ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్ తన సంతాపం తెలియజేసిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Sushanth singh Rajputh