SARKARUVAARI PAATA TEAM IS GOING TO SURPRISE SUPER STAR MAHESH FANS MHN
Mahesh Sarkaruvaari Paata: ఫ్యాన్స్ కోసం ట్రీట్ సిద్ధం చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్ 'సర్కారువారి పాట' టీమ్
Sarkaruvaari Paata team is going to surprise Super star Mahesh fans
Mahesh Sarkaruvaari Paata: 'సర్కారువారి పాట' యూనిట్ సూపర్‌స్టార్ మహేశ్ అభిమానుల కోసం ఓ ట్రీట్‌ను అందిస్తూ వీడియో విడుదల చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'సర్కారువారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మహేశ్, కీర్తిసురేష్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. ఈ ఫిబ్రవరి 21కంతా దుబాయ్ షెడ్యూల్ పూర్తవుతుందట. ఈ లాంగ్ షెడ్యూల్ తర్వాత అదే రోజున యూనిట్ హైదరాబాద్ తిరిగొచ్చేస్తుంది. చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత తదుపరి షెడ్యూల్‌లను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారనేది సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ తప్ప మరో అధికారిక ప్రకటన లేదు. దీంతో మహేశ్ అభిమానులు 'సర్కారువారి పాట' అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దుబాయ్‌లో సినిమా షూటింగ్ పూర్తయిన రోజునే అంటే ఫిబ్రవరి 21నే ఈ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేస్తుందట.
ఇందులో రెండు షెడ్యూల్స్కు సంబంధించిన వర్కింగ్ ప్రోగ్రెస్‌ను ఈ వీడియోలో చూపిస్తారట. అంతే కాదండోయ్.. తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం కూడా రివీల్ అవుతుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. గత ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మహేశ్.. రాబోయే సంక్రాంతికి 'సర్కారువారి పాట' సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.
సర్కారువారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విలన్‌ను హీరో ఇండియాకు తిరిగి ఎలా రప్పించాడనే పాయింట్‌తో సినిమా రూపొందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.