హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వచ్చేసింది.. సూపర్ స్టార్ ప్యాక్ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వచ్చేసింది.. సూపర్ స్టార్ ప్యాక్ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తన ఖాతాలో ఓ సినిమా ఉండగానే.. మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు.

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తన ఖాతాలో ఓ సినిమా ఉండగానే.. మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి టీజర్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన అభిమానులకు మొత్తానికి టీజర్ రుచి చూపించాడు మహేష్ బాబు. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు సర్కారు వారి పాట టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఉన్నట్టుండి ఈ టీజర్ ను రాత్రి 12 గంటలకు విడుదల చేసి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. ఇక ఆ రాత్రికి రాత్రే విపరీతమైన వ్యూస్ తో పాటు ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ టీజర్ విషయానికొస్తే మాత్రం అందులో మహేష్ బాబు నటన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

Sarkaru Vaari Paata

ఇక కీర్తి సురేష్ మాత్రం అందంగా కనిపించడం.. వెన్నెల కిషోర్ తో పంచ్ లు వేయడం వంటివి చూస్తుంటే ఓ రేంజ్ లో హిట్ అని ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో బాగా హల్ చల్ గా మారింది. నిజానికి ఈ టీజర్ విడుదల చేశాక చాలా వరకు నమ్మలేకపోతున్నామని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు సర్కార్ వారి పాటతో మంచి విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం.

' isDesktop="true" id="988838" youtubeid="2cVu7KZxW3c" category="movies">

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఇందులో మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా ఉందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు హారిక హాసిని క్రియేషన్స్ లో కూడా ఓ సినిమాలో చేయనున్నాడు మహేష్.

First published:

Tags: Keerthy Suresh, Mahesh Babu, Parusuram patla, Sarkaru Vaari Paata Birthday Blaster, Sarkaru vari paata, Taman s, Tollywood

ఉత్తమ కథలు