హోమ్ /వార్తలు /సినిమా /

SVP: మహేష్ బాబుకు షాక్.. సర్కారు వారి పాట ట్రైలర్ లీక్

SVP: మహేష్ బాబుకు షాక్.. సర్కారు వారి పాట ట్రైలర్ లీక్

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

ఈ సినిమాకు సంబంధించిన పాటలు అఫీషియల్ గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి.  ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ చేసిన సినిమా ఇదే. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ సినిమాను లీకులు వేధిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. దీంతో సినిమాకు సంబంధించిన కొన్ని అప్ డేట్స్‌ను లీకువీరులు ముందుగానే బయటపెట్టేస్తున్నారు. మూవీ టీం అఫీషియల్ గా విడుదల చేయకముందే సోషల్ మీడియాలో లీక్స్ అవుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజాగా ఇప్పుడు సర్కారు వారి పాట ట్రైలర్ కూడా లీక్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నాడు.సర్కారు వారి పాట తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఇదివరకే కొన్ని అప్డేట్స్ తో క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమా పాటలకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అఫీషియల్ గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇక సోమవారం రావాల్సిన ట్రైలర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ వీడియో క్లిక్ చేస్తే మాతరం అన్ అవైలబుల్ మెసేజ్ వస్తోంది.దీంతో వీడియోను మళ్లీ అన్ అవైలబుల్ చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ఎక్కువగా మహేష్ బాబు చేతిలో తాళాల గుత్తి పట్టుకునే విలన్స్ ను కొడుతున్న సీన్ వైరల్ గా మారుతోంది.దీంతో లీకు వీరులపై మహేష్ ప్యాన్స్ మండిపడుతున్నారు.

First published:

Tags: Keerthi Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Birthday Blaster

ఉత్తమ కథలు