Home /News /movies /

SARKARU VAARI PAATA TELANGANA GOVERNMENT SPECIAL PERMISSION TO MAHESH BABU SARKARU VAARI PAATA IN HYDERABAD TA

Sarkaru Vaari Paata : ’సర్కారు వారి పాట’ స్పెషల్ షోస్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు..

‘సర్కారు వారి పాట’ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు (Twitter/Photo)

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా మేకర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు.

    Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా మేకర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో నాలుగు థియేటర్స్‌లో ఉదయం 4 గంటలకు స్పెషల్ షోస్ వేసుకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్‌తో పాటు శ్రీరాములు థియేటర్స్‌లో స్పెషల్ షోస్‌కు అనుమతులు ఇచ్చారు. ఇంకోవైపు ఈ సినిమాకు వారం రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టిక్కెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే కదా.

    ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని పరుశురామ్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా తెరకెక్కించారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ‘సర్కారు వారి పాట’లో  మహేష్ బాబు ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్స్‌తో అదరగొడుతున్నారు.


    ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ  రేంజ్‌లో జరిగింది. ఏరియా వైజ్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

    Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ సహా మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ఇవే.. ఇంతకీ హిట్స్ ఎన్నంటే..


    నైజాం (తెలంగాణ):  రూ. 36కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ.  13 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.  12.50 కోట్లు
    ఈస్ట్: రూ. 8.50 కోట్లు
    వెస్ట్: రూ. 7 కోట్లు
    గుంటూరు: రూ. 9 కోట్లు
    కృష్ణా: రూ. 7.5 కోట్లు
    నెల్లూరు:రూ. 4 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 96.50 కోట్లు

    కర్ణాటక : రూ. 8.50 కోట్లు
    రెస్టాఫ్ భారత్ : రూ.  3 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 11 కోట్లు

    వాల్డ్ వైడ్‌గా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ .. 120 కోట్లు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 121 కోట్ల షేర్ రాబట్టాలి.ఇక మహేష్ బాబు తన కెరీర్‌లో వరుసగా ‘భరత్ అను నేను’, ‘మహర్షి’, సరిలేరు నీకెవ్వవరు’ వంటి వరుసగా హాట్రిక్స్ హిట్స్ అందుకొని మంచి ఊపు మీదున్నారు. ఇపుడు అదే ఊపులో ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌తో మహేష్ బాబు డబుల్ హాట్రిక్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

    Mahesh Babu - Balakrishna : అపుడు నాగార్జున.. ఇపుడు మహేష్ బాబు.. బాలయ్యకు గట్టి కౌంటర్ ఇచ్చారుగా..


    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Telangana, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు