రివ్యూ : సర్కారు వారి పాట
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు,తనికెళ్ల భరణి తదితరులు..
సంగీత దర్శకుడు: థమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
దర్శకత్వం : పరశురామ్ పెట్లా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు అంచనాలు అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
హీరో మహేష్ (మహేష్ బాబు) తల్లిదండ్రులు బ్యాంకు లోను కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు. వారి ఇంటిని పొలాన్నిసర్కారు వారి పాటలో వేలం వేస్తారు. ఈ క్రమంలో అనాథైన మహేష్ .. ఒక మాస్టారి అండతో ఒక అనాథశ్రమంలో చదువుకుంటాడు. ఆ తర్వాత అతను అమెరికాలో ఒక లోన్ రికవరీ బిజినెస్ చేస్తుంటాడు. మొండి బాకాయిలను సైతం ముక్కు పిండి వసూళు చేసే టైప్ అన్నమాట. ఈ క్రమంలో మహేష్‌కు కళావతి (కీర్తి సురేష్)తో పరిచయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఆమె మహేష్ దగ్గర కొంత డబ్బుగా అప్పుగా తీసుకుంటోంది. ఆ తర్వాత డబ్బు చెల్లించకుండా హీరోను మోసం చేస్తోంది. ఈ క్రమంలో హీరో .. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)ని కలుస్తాడు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉందని మీడియాకు ఎక్కడంతో కథ మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో మహేష్ బాబు.. రాజేంద్ర నాథ్ దగ్గర పదివేల కోట్లు అప్పు ఉన్నట్టు ఎందుకు చెప్పాడు. ఆ తర్వాత జరిగే నాటకీ పరిణామాలేంటి ? సర్కారి వారి పాట స్టోరీ.
కథనం..
దర్శకుడు ప్రస్తుతం ప్రతి ఒక్క లో క్లాస్, మాస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌ను సర్కారి వారి పాట సినిమా కోసం ఎంచుకున్నాడు. సామాన్య మధ్య తరగతి మనిషి ఇంటి కోసమే.. కుటుంబ అవసరల కోసమే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడం సహజం. మిడిల్ క్లాస్ మేన్ ఒక్క EMI కట్టకపోతే.. ఏదో భూకంపం వచ్చినట్టు రికవరీ ఏజెంట్స్ ఆయా వ్యక్తులపై పడుతుంటారు. అదే వేల కోట్లు అప్పులు చేసి బ్యాంకులు మోసం చేసేబడా బాబులును ( ఋణ ఎగవేతదారులు) (ఢీఫాల్టర్స్) కింద నమోదు చేస్తుంటారు.అదే సామాన్యుల విషయానికొస్తే.. అదే ఋణం కట్టకపోతే.. అతని బజారుకీడ్చి అతని ఆస్తులను సర్కారు వారు పాటలో వేలం వేస్తుంటారు. ఇలాంటి కామన్ ఆడియన్స్‌ను కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌ను కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు పరశురామ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు సముద్రతీరంలోని ఫైట్ మాస్ ఆడియన్స్ పిచ్చేక్కించేలా పిక్చరైజ్ చేసాడు. ఇక విలన్‌కు బ్యాంకు అధికారులు ఢీఫాల్టర్ కింద నోటీసులు అందజేసే సీన్‌లో లారీతో అన్నింటినీ ఢీ కొంటూ విలన్ ఇంటికే వెళ్లే సీన్స్‌లో దర్శకుడి మాస్ పల్స్ ఏంటో తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోంజిగ్ బాగుంది. థమన్ ఈ సినిమాను తన మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టేసాడనే చెప్పాలి. మది ఫోటోగ్రఫీ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
మహేష్ బాబు మరోసారి పోకిరి + దూకుడు అని ముందు నుంచి చెప్పినట్టే.. ఈ సినిమాలో లాజిక్‌లను పక్కనపెడితే..మహేష్ బాబు తన యాక్టింగ్ ప్లస్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేసాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో దుమ్ము దులిపేసాడు. పోకిరి, దూకుడు తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమాగా మహేష్ బాబు కెరీర్‌లో సర్కారు వారి పాట నిలిచిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మహేష్ బాబు తొలిసారి ఈ సినిమాలో తన పేరైన మహేష్ గా నటించడం సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చే మూమెంట్. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే.. ప్రేక్షకులు ఇప్పటికీ మహానటి సావిత్రినే చూస్తున్నారు. ఈ తరహా పాత్రలో బాగానే చేసినా.. మహానటి ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల మదిలోంచి పోలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని జీవించడానే చెప్పాలి. ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. మిగతా పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, సుబ్బరాజు కామెడీ ప్రేక్షకులను నవ్విస్తోంది. అటు తనికెళ్ల భరణి, నాగబాబు, పోసాని ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్
కథ, ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్ సీన్స్
మహేష్ బాబు నటన
పరశురామ్ టేకింగ్
తమన సంగీతం
మైనస్ పాయింట్స్
కీర్తి సురేష్
సెకండాఫ్
అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలు
చివరి మాట : సామాన్యులను ఆలోచింపజేసే ‘సర్కారు వారి పాట’
రేటింగ్ : 3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Movie Review