Home /News /movies /

SARKARU VAARI PAATA SECOND SINGLE PENNY SONG PROMO RELEASED AND SITARA GHATTAMANENI SPECIAL ENTRY PK

Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్.. ‘సర్కారు వారి పాట’లో సితార పాప..

సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ సితార డాన్స్ (sarkaru vaari paata)

సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ సితార డాన్స్ (sarkaru vaari paata)

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో దర్శకుడు పరశురామ్‌ (Parasuram) ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు.

ఇంకా చదవండి ...
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో దర్శకుడు పరశురామ్‌ (Parasuram) ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్‌ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainments), 14 రీల్స్‌ ప్లస్‌ (14 Reels Plus) బ్యానర్‌లపై సంయుక్తంగా నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సర్కారు వారి పాట సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

దీనిపై ఇప్పటికే అధికారిక సమాచారం కూడా వచ్చింది. ఇదిలా ఉంటే మార్చి 20న సర్కారు వారి పాట నుంచి రెండో పాట విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది చూసిన తర్వాత అంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే ప్రోమోలో సర్‌ప్రైజ్ కూడా ఉంది. ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమేనిన కూడా కనిపించింది. మొదటిసారి ఈమె స్క్రీన్ మీద కనిపించడం. ఇప్పటికే గౌతమ్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. అందులో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో అలరించాడు. సినిమా ఫ్లాప్ అయినా గౌతమ్ నటన అందర్నీ ఆకట్టుకుంది.

RRR ticket rates hikes: ఆస్తులు రాసివ్వాలేమో.. తెలంగాణలో భారీగా పెరిగిన ‘RRR’ సినిమా టికెట్ రేట్లు..


ఇప్పుడు కూతురు సితార కూడా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి కోసం ఆయన సినిమాలోనే ఓ పాటలో మెరిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ప్రతీ కొత్త పాటకు డాన్సులు చేసి పోస్ట్ చేస్తుంది. అవి కాస్తా వైరల్ అవుతుంది. కళావతి పాటకు కూడా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతోనే వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చేలా కనిపిస్తుంది సితార. పెన్నీ పెన్నీ అంటూ సాగే ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్‌ డ్యాన్సర్‌గా కనిపించింది.


అల వైకుంఠపురములో.. ఓ మై గాడ్ డాడీ పాట సెటప్ అంతా ఇందులో కనిపిస్తుంది. చూస్తుంటే ఇది కూడా అలాంటి రాప్ సాంగ్ అనిపిస్తుంది. పైగా దీని రాప్ కూడా రోల్ రైడానే పాడాడు. సితార ఈ పాటలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే స్టెప్పులు కూడా బాగానే వేసింది. ప్రోమోలోనే ఇలా ఉంటే.. మార్చ్ 20న పాట విడుదలైన తర్వాత మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటారేమో..? మహేష్ ఓ ఫారిన్‌ లేడి గ్రూప్‌తో డ్యాన్స్‌ చేస్తుంటే.. సితార మరో గ్రూప్‌తో లీడ్‌ డ్యాన్స్‌ర్‌గా ఆకట్టుకుంటుంది. తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మొత్తానికి పాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా సినిమాలోనూ సితార ఎంట్రీ ఇస్తే చూడాలనుకుంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు