Sarkaru Vaari Paata : ఈ సినిమా ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా అమెరికాలో 2.2 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. దీంతో సర్కారు వారి పాట టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇక ఈ సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే..
Mahesh Babu | Sarkaru Vaari Paata Collections : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. సర్కారు వారి పాట సినిమా 9వ రోజు కొంచెం డౌన్ అయ్యిందని అంటున్నారు. సెకెండ్ వీక్ స్టార్ట్ అయ్యాక 8వ రోజు మంచి హోల్డ్‌లో సర్కారు వారి పాట 9వ రోజు కాస్తా తగ్గి.. రెండు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రేంజ్లో షేర్ని అందుకుంది. ఇక అది అలా ఉంటే ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా అక్కడ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా అమెరికాలో 2.2 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. దీంతో సర్కారు వారి పాట టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది.
ఈ సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 99.6 కోట్ల షేర్‌ను 158.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీంతో ఇంకా 21.35 కోట్ల షేర్ ని సొంతం అందుకోవాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి.
ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది.ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.