Mahesh Babu - Sarkaru Vaari Paata - Release Date | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం ఈ సినిమ ా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సర్జరీ వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. మధ్యలో అన్నయ్య రమేష్ బాబు మృతితో మహేష్ బాబు అప్సెట్ అయ్యారు.ఓ నెల రోజుల పాటు షూట్ చేస్తే.. ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది. ఇప్పటికే మహేష్ గత కొన్ని రోజులుకుగా మోకాలికి సంబంధించిన ఓ సమస్యతో బాధపడుతున్నారు.
ఇప్పటికే ఓ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మరో సర్జరీ కూడా జరగాల్సి ఉందట. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆయా సినిమాలేని కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడదలను పోస్ట్‌పోన్ చేశాయి. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించిగా.. మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది.
సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతలోనే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 1న విడుదల తేదిని ప్రకటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తున్నట్టు ప్రకటించడంతో ఆచార్య ఏప్రిల్ 29కు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇక మహేష్ బాబు నటించిన ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ వంటి చిత్రాలు మే నెలలో విడుదలయ్యాయి. కానీ ఈ సినిమాలేని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇపుడు ‘సర్కారు వారి పాట’ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కళావతి నుంచి మొదటి పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్.. కళావతి పాత్రలో నటిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.
Here's #KalaavathiSongPromo ♥
▶️ https://t.co/i9Yg1oK1Mm
Witness the Classical Melody on FEB 14 ?#SarkaruVaariPaata#SVPOnMay12
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/d68AjNJLTQ
— SarkaruVaariPaata (@SVPTheFilm) February 11, 2022
సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.
Pooja Hegde : కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే.. పిక్ వైరల్ ..
ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, Mythri Movie Makers, Sarkaru Vaari Paata, Tollywood